EU parliament delegates to vist JK కశ్మీర్ పర్యటనకు ఈయూ పార్లమెంట్ బృందం

European parliament meet pm modi in delhi ahead of visiting jammu and kashmir

Abrogation, Ajit Doval, Article 370, European Parliament, Jammu and Kashmir, NSA, Pakistan, PM Modi, EU Delegates,Terrorism

PM Modi told the delegation of European Parliament that urgent action should be taken against those who shelter terrorists, support terror organisations and use them as a state policy

జమ్మూలో ఈయూ డెలిగెట్స్ పర్యటనకు కేంద్రం అనుమతి

Posted: 10/28/2019 04:45 PM IST
European parliament meet pm modi in delhi ahead of visiting jammu and kashmir

కాశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలోని విపక్ష నేతలు కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అరెస్టు చేసి తిప్పిపంపిన భారత బలగాలు.. తాజాగా మాత్రం విదేశీ పార్లమెంటు సభ్యుల బృందాన్ని అక్కడ పర్యటించేందుకు అనుమతించనుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో విదేశీ బృందానికి పర్యటించేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. 28సభ్యులతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ బృందం జమ్మూకశ్మీర్ లో పర్యటించనుంది.

ఇవాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్ తో ఈ బృందం సమావేశం కానుంది. కశ్మీర్ లో పరిస్థితులను ఈ బృందానికి మోడీ,దోవల్ వివరించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో వ్యాలీలో ఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

అప్పటినుంచి ఒక్కొక్కటిగా కశ్మీర్ లో ఆంక్షలను సడలిస్తుంది ప్రభుత్వం. అదుపులోకి తీసుకున్న పలువురు నాయకులను వదిలిపెట్టింది.
అయితే అదుపులోకి తీసుకుని ఇప్పటికీ విడుదల చేయబడని మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా మరికొందరు నాయకులను వెంటనే రిలీజ్ చేయాలని భారత్ ను ఇటీవల అమెరికా కోరింది. కశ్మీర్ లో పరిస్థితులను పరిశీలించేందుకు అంతర్జాతీయ జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ దేశ పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని వైట్ హౌస్ తెలిపిన విషయం తెలిసిందే.

ఇటీవల పోస్ట్ పెయిడ్ సర్వీసులను వ్యాలీలో పునరుద్దరించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాక్ ఆరోపణలు చేయడం,దానికి అమెరికా వంత పాడటం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కశ్మీర్ విషయంలో పాక్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కళ్లారా ప్రపంచానికి చూపించేందుకు విదేశీ ప్రతినిధి బృందం కశ్మీర్ లో పర్యటించేందుకు భారత్ అనుమతించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles