Pawan Kalyan fires on police officers at Bhimavaram అసభ్యకర పోస్టులపై చర్యలేవీ?: పోలీసులను నిలదీసిన పవన్

Pawan kalyan slams police for no action against obscene messages

Janasena, Pawan Kalyan, Mangalagiri, Amaravati, social media, crime against women, harrassment against women, young girls, obscene messages, accused persons, police officials, andhra pradesh, politics

Jana Sena party President Pawan Kalyan questions police officers for not taking action against the accused, who sent obscene messages to a young girl and harrassing her.

అమ్మాయికి అసభ్యకర పోస్టులపై చర్యలేవీ?: పవన్ కల్యాణ్ ఫైర్

Posted: 10/24/2019 04:54 PM IST
Pawan kalyan slams police for no action against obscene messages

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అమ్మాయి తన కుటుంబపోషణ కోసం రోడ్డు ఎక్కితే.. ఆమెపై చులకన భావంతో అసభ్యకర పోస్టులు పెడుతున్న అకతాయిలపై పోలీసులు తీసుకుంటున్న చర్యలేమిటని ఆయన ప్రశ్నించారు. యువతిని కులం పేరుతో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తున్నారని పిర్యాదు చేసినా.. అకతాయిల ఆటలు నిరాటంకంగా సాగుతున్నాయని.. ఇదేనా పోలీసుల పనితీరుకు దర్పణమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిర్యాదు చేయగానే పోలీసులు స్పందిస్తే.. అకతాయిల ఆగడాలకు కళ్లెం పడుతోందని అన్నారు.

అలా కాకుండా పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆకతాయిలు మరింత శృతిమించుతున్నారని, దీంతో జరగకూడని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని.. ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఆనర్థాలు జరిగిన తరువాత స్పందించడం కంటే జరుగుతొందని తెలియగానే స్పందించి నివారించగలగడమే పోలీసుల కర్తవ్యమని ఆయన సూచించారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న అనంత స్వాతి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియా విషయంలో సరైన చట్టాలు లేవు కనుకే కొంతమంది అసభ్య పోస్టులతో పెట్రేగిపోతున్నారని అన్నారు. త్వరలోనే సోషల్ మీడియా నియమాలు మరింత కఠినతరం కానున్నాయని, అప్పుడు ఇలా పెట్రేగిపోతున్న వారందరికి శిక్ష తప్పదని అన్నారు. అటు.. ఘటనపై పోలీసుల అలసత్వాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ‘వైసీపీ నాయకులపై సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే చాలు వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారని కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఒక ఆడ బిడ్డ మీద నీచంగా పోస్టులు పెట్టి, కులాన్ని దూషిస్తే మాత్రం పోలీసు అధికారులు స్పందించడం లేదని ఆయన ఫైరయ్యారు.

అదే సమయంలో మన కోసం తిరిగిన ఆడపిల్లను రక్షించుకోకపోతే సిగ్గు చేటు అని కాగా, ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని భగీరథ కెమికల్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయించాలని, ఆ ఫ్యాక్టరీ కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్ధాలతో భూగర్భ జలాలు కలుషితమై పచ్చని పంట పొలాలు నాశనమైపోతున్నాయని, ఆ నీటిని తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles