'Chaddi Gang' photos scare markapuram residents మార్కాపురంలో మాటేసిన చెడ్డీగ్యాంగ్.. స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్..

Chaddi gang photos scare markapuram residents

Chaddi Baniyan gang, Chaddi gang, markapuram, guntur, vinukonda, robberies, notorious criminals, Gang, Andhra pradesh, Crime

The photos of 'Chaddi Gang', an alleged gang of thieves just in their innerwears known to move around in the nights in their innerwears, is notorious for committing robberies mostly when residents are not in their home, created panic among people of markapuram of guntur district.

మార్కాపురంలో మాటేసిన చెడ్డీగ్యాంగ్.. స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్..

Posted: 10/24/2019 05:56 PM IST
Chaddi gang photos scare markapuram residents

గుంటూరు జిల్లా వినుకొండలోని స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు నిద్ర కరువవుతుందో.. ఎవరి ఫోటోలు, వీడియోలు చూస్తే.. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా ప్రజల వంతుల వారీగా గస్తీ వేసుకుని తమ ప్రాంతాల్లో కాపుకాస్తారో.. వారే చెడ్డీ గ్యాంగ్. తాజాగా వీరి ఫోటోలు, వార్తలు వింటుంటేనే వినుకొండ ప్రాంతవాసులకు వణుకు పుడుతొంది. అదేంటి.. ఎందుకలా అంటే.. దొంగతనాల్లో అరితేరిన ఈ చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అడ్డువస్తే మనుషుల ప్రాణాలను కూడా సునాయాసంగా తీసేస్తారు. అలాంటి వీరు మార్కాపురంలో మాటేసినట్లు వార్తలు వినబడుతున్నాయి.

గుంటూరు జిల్లా వినుకొండలోని మార్కాపురం రోడ్డులో చొక్కాలు లేకుండా, కేవలం నిక్కర్లు మాత్రమే ధరించిన ముగ్గురు దొంగలు ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రవేశించిన వీడియో ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది. వారి వాలకం చూస్తేంటే కచ్చితంగా చెడ్డీగ్యాంగ్ అయి ఉంటుందన్న ప్రచారం జోరందుకోవడంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖాలకు ముసుగు వేసుకుని చెడ్డీలు మాత్రమే ధరించిన ముగ్గురు దొంగలు మార్కాపురం రోడ్డులోని సాయి అపార్ట్‌మెంట్ వద్దకు తెల్లవారుజామున మూడు గంటలకు చేరుకున్నారు.

ప్రహరీ గోడపై నుంచి అపార్టుమెంటు లోపలికి దిగిన దొంగల్లోని.. ఒకరి చేతిలో రాయి, మిగతా వారి చేతుల్లో రాడ్లు ఉన్నాయి. అనంతరం అపార్ట్ మెంట్ మొత్తం తిరిగిన దొంగలు కాసేపు సెక్యూరిటీ గార్డు గది వద్ద నిల్చుని ఆపై వెళ్లిపోయారు. ఉదయం సీసీటీవీ ఫుటేజీ చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకుని పరిశీలించారు. దొంగలు నిక్కర్లు మాత్రమే ధరించి ఉండడంతో అది చెడ్డీగ్యాంగ్ ముఠానే అయి ఉంటుందని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సీఐ చినమల్లయ్య మాట్లాడుతూ.. పట్టణంలో రాత్రివేళ గస్తీని ముమ్మరం చేసినట్టు చెప్పారు. ఈ విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తామని, ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు.. పోలిస్ స్టేషన్లో సమాచారం అందిస్తే వారింటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా నిఘా వుంచుతామని అన్నారు. ప్రజలందరూ ఎల్‌హెచ్ఎంఎస్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఐ కోరారు. దొంగలను పట్టుకునేందుకు ప్రజలు సాంకేతికతను వినియోగించుకోవాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles