Expect heavy rains till October 24 అలర్ట్: నగరంలో మరో 3రోజులు భారీ వర్షాలే..

Heavy rains to lash capital city for next 3 days imd alerts

Arabian sea, Hyderabad rain, rain in Hyderbad, weather in hyderabad, current weather in hyderabad, rain in hyderabad today live, hyderabad weather, weather in secunderabad, Telangana, Telangana weather, Telangana rains, moderate rainfall in Hdyerabad, Rains in Telangana, Rain Forecast

Hyderabad, the state capital of Telangana, is one of the major cities that's been most affected by the heavy rain. It will be a rainy start to the festive season as the IMD, Hyderabad has issued a heavy rainfall warning till October 24.

అలర్ట్: రానున్న మూడు రోజులు రాజధాని నగరంలో భారీ వర్షాలు

Posted: 10/21/2019 10:25 AM IST
Heavy rains to lash capital city for next 3 days imd alerts

హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వీడడం లేదు. ఈ నెల ఆరంభం నుంచి నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో ప్రతిరోజు కురుస్తునే వున్న వరుణుడు నగరవాసుల్ని తడిసి ముద్దచేస్తున్నాడు, ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాన్ని కురిపించిన వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చాటేందుకు సిద్దమవుతున్నాడని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని తాజా సమాచారం.

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాదులో ఈ నెల 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావం వల్ల నిన్న నగరంలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాద్ సహా విశాఖపట్నం, ఖమ్మం, హన్మకొండ, నిజామాబాద్, మెదక్, మచలీపట్నం తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ మహానగరంలో రోడ్లపై వర్షం నీరు నిలుస్తుండటంతో నగరంలో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో మరీముఖ్యంగా ఉదయం, సాయంకాల వేళల్లో కార్యాలయాలకు, విధులకు వెళ్లేవారు ఇబ్బుందులను ఎదుర్కోంటున్నారు. అసలే ఆర్టీసీ బస్సుల సమ్మె నేపథ్యంలో గత్యంతర పరిస్థితుల కారణంగా సొంతవాహనాలపై వెళ్లున్న నగరవాసులు నగరంలో గోతులమయంగా మారిన రోడ్లపై వెళ్తూ.. అనేక అసవ్థలను ఎదుర్కోంటున్నారు. ఈ క్రమంలో తాజా వాతావరణ కేంద్రం అధికారుల హెచ్చరికలు వారి గుండెళ్లో రైళ్లు పరిగెట్టించేలా చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rain  Record rainfall  hyderabad  Telangana  moderate rainfall  Rain Forecast  Secundrabad  

Other Articles