TSRTC Strike: Congress leader's house arrest ఆర్టీసీ సమ్మె: కాంగ్రెస్ కీలక నేతల హౌజ్ అరెస్టులు..

Tsrtc strike congress leader s house arrest ahead of pragathi bhavan protest

TSRTC Workers, Congress, Pragathi Bhavan, Revanth Reddy, Shabbir Ali, CM KCR, TSRTC workers salaries, TSRTC employees wages, High Court, Telangana Government, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government, Politics

Several Congress leaders and workers were either placed under house arrest or were taken into preventive custody in Hyderabad and parts of Telangana on Monday hours before their proposed plan to lay siege to Pragathi Bhavan,

కాంగ్రెస్ కీలక నేతల హౌజ్ అరెస్టులు.. బేగంపేట మెట్రోకు తాళాలు..

Posted: 10/21/2019 09:29 AM IST
Tsrtc strike congress leader s house arrest ahead of pragathi bhavan protest

తెలంగాణ అర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం దిగి రాకపోవడంతో ముఖ్యమంత్రిలో పెరిగిన అహంకార ధోరణికి దర్పణం పడుతోందని అరోపిస్తున్న విపక్షాలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలతో పాటు పై ఆర్టీసీ జేఏసీ నేతలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్భంధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటారని భావించిన పోలీసులు ముందస్తు చర్చలను చేపట్టారు.

హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. వరంగల్ లో డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డికి గృహ నిర్బంధం విధించారు. అలాగే, వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ఎల్బీనగర్‌లలో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి తరలి వస్తున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్ కీలక నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భంధంలోకి తీసుకున్నారు. సీఎల్సీ నేత మల్లు భట్టివిక్రమార్కను హౌస్‌ అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారికి మద్దతుగా నిలిచిన పార్టీలు మండిపడుతున్నాయి. కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు సూచనను సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కార్మికులు, పలు పార్టీలు తమ నిరసన కొనసాగిస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పిలుపును అనుసరించి ప్రగతి భవన్ ముట్టడికి కోసం వస్తున్న వస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. బేగంపేట మెట్రో స్టేషన్‌ను కూడా కాసేపు మూసేశారు. తాళాలు వేసి మరీ అక్కడ ఎవరినీ దిగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో వైపు కాంగ్రెస్‌ ముఖ్యనేతలను హౌస్‌ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Workers  CM KCR  High Court  Congress  Pragathi Bhavan  Revanth Reddy  Shabbir Ali  Politics  

Other Articles