Lalitha Jewellery robbery case interesting updates ‘లలితా జ్యువెలరీ’ చోరీ కేసు: భార్యతో కలసి ‘దొంగ’ రెక్కీ

Man arrested in lalitha jewellery robbery case hunt on for others

lalitha jewellers theft in tiruchirappalli, 13.5 Kg Gold, Murugan, wife, observations, Suresh, lalitha jewellers theft in tamil nadu, lalitha jewellers, lalitha jewellery theft, Chathiram bus Stand, Chathiram theft, tiruchirappalli theft, gold stolen, tamil nadu robbery, tamil nadu, crime

In connection with the robbery at Lalitha jewellery store in Tamil Nadu’s Tiruchirappalli.. accused Suresh has made the shocking revelation that his uncle Murugan has observed the store pretending as customer along with his wife.

‘లలితా జ్యువెలరీ’ చోరీ కేసు: భార్యతో కలసి ‘దొంగ’ రెక్కీ

Posted: 10/21/2019 11:24 AM IST
Man arrested in lalitha jewellery robbery case hunt on for others

తమిళనాడు సహా దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లలితా జ్యువెలరీ చోరి కేసులో అసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులైన గణేశన్, మురుగన్ లను విచారిస్తున్న పోలీసులు తమ దర్యాప్తులో కొత్త విషయాలను తెలుసుకుని నివ్వెరపోతున్నారు. వీరిద్దరి అరెస్టుతో పురోగతి సాధించిన తమిళనాడు పోలీసులు అసలు దొంగతనం చేయడానికి ఎలా ప్లాన్ చేశారు. అందుకు ముందు రెక్కీ ఏమైనా నిర్వహించారా.? అన్న విషయాలను విచారణలో తెలుసుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులకు సంచలన విషయాలను నిందితులు వెలువరించారని సమాచారం. తిరుచ్చిలోని లలితా జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీకి పాల్పడిన ఇద్దరి దొంగలలో మాస్టార్ మైండ్ అయిన మురుగన్ ఈ చోరీకి ముందు తన భార్యతో కలసి పలుమార్లు షోరూమ్ కు వెళ్లడం అక్కడ తన భార్య నగలు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆయన షోరూమ్ లోని పరిస్థితులను మురుగన్ గమనించాడని పోలీసులు వెల్లడించారు. అలా పలుమార్లు తన భార్యతో ఈ షోరూమ్ కు వెళ్లిన మురుగన్ రెక్కీ నిర్వహించాడని పోలీసులు తెలిపారు.

అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా గమనించి వాటిన పూర్తిగా తన బుర్రలో నిక్షిప్తం చేసుకున్న తరువాత.. ఇక ఎక్కడ కన్నం వేస్తే షోరూమ్ లోకి చేరుకుని.. తిరిగి బయటకు వెళ్లడానికి తేలిగ్గా వుండే స్థలాన్ని కూడా అంచనా వేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఫోరూమ్ పై పూర్తిగా ఆవగాహన వచ్చిన తర్వాత పక్కాగా ప్లాన్ చేసి నగలు కాజేసినట్టు తెలిపారు. అయితే ఈ విషయాలను మురగన్ సహా నిందితుడు సురేశ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

ఈ నెల 14 నుంచి పోలీసుల కస్టడీలో ఉన్న సురేశ్ చెబుతున్న విషయాలు పోలీసులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. దోపిడీ చేయడానికి ముందు మురుగన్ తన కుటుంబంతో కలిసి ఆ ప్రాంతానికి మకాం మారుస్తాడు. ఆ తర్వాత తీరిగ్గా దోపిడీ చేసి మాయమవుతాడు. లలిత జువెలరీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు దోపిడీలకు ముందు కూడా అతడు ఇలానే చేసినట్టు సురేశ్ తెలిపాడు. అంతేకాదు, చెన్నైలోని అన్నానగర్‌లో చోరీ తర్వాత పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఓ పోలీసు అధికారికి మురుగన్ రూ. 30 లక్షలు ఇచ్చాడని, తిరువారూర్ పోలీసు అధికారికి  ఖరీదైన కారు కొనిచ్చాడని, ఓ సినీ నటికి బంగారు ఆభరణాలను బహుమతిగా ఇచ్చాడని విచారణలో సురేశ్ వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lalitha jewellers  13.5 Kg Gold  Murugan  wife  observations  Suresh  theft  tiruchirappalli  tamil nadu  crime  

Other Articles