KCR Not Interested to Retain the Sacked TSRTC Employees చర్చలు లేవ్.. హైకోర్టు ఆదేశాలపై సీఎం విముఖత..

Kcr not interested to retain the sacked tsrtc employees

KCR, Telangana, TSRTC, TSRTC Strike, TSRTC Employees

Telangana Chief Minister K Chandrasekhar Rao (KCR) decided to stay strong on his stand who surprised many after sacking 48,000 TSRTC employees.

చర్చలు లేవ్.. హైకోర్టు ఆదేశాలపై సీఎం విముఖత..

Posted: 10/17/2019 11:24 AM IST
Kcr not interested to retain the sacked tsrtc employees

సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచితంగా సమ్మెకు వెళ్లాయని, ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదన్నారు. దానిపై సీఎం కేసీఆర్‌ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 4 గంటలకు పైగా చర్చించారు.  సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ ఎండీ పోస్టును సైతం తక్షణమే భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అందుకోసం సమర్థులైన అధికారిని నియమించేందుకు సమావేశంలో కసరత్తు చేశారు. ఈ నెల 21 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో  బస్సు సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులు, జర్నలిస్టులు, ఇతర వర్గాల వారికి ఇచ్చిన పాస్‌లను బస్సుల్లో అనుమతించాలి. ఆర్టీసీ అద్దె బస్సులు మరిన్నింటిని తీసుకోవాలని, అన్ని రూట్లలో వాటిని నడిపించాలన్నారు. వెంటనే ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని, మరిన్ని బస్సులు అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana  TSRTC  TSRTC Strike  TSRTC Employees  

Other Articles