HC orders government to pay RTC workers salaries ఆర్టీసీ కార్మికులకు ఊరట.. జీతాలు చెల్లింపుకు హైకోర్టు అదేశం

Tsrtc strike high court orders government to pay workers salaries

TSRTC Workers, TSRTC workers salaries, TSRTC employees wages, High Court, Telangana Government, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government, Politics

After High Court orders Telangana government to have talks and settle out the issues of TSRTC workers, today hearing an another petition the apex court ordered the government to pay the salaries of employees by monday.

ఆర్టీసీ కార్మికులకు ఊరట.. జీతాలు చెల్లింపుకు హైకోర్టు అదేశం

Posted: 10/16/2019 05:27 PM IST
Tsrtc strike high court orders government to pay workers salaries

ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తున్న అర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. సమ్మె నేపథ్యంలో కార్మికుల వేతనాలను నిలిపివేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేసిన పిటీషన్ పై విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్తానం కార్మికులకు జీతాలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అదేశించింది. ఈ నెల 21లోపు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

సెప్టెంబర్‌ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ లేదు. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్‌.. వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అక్టోబర్ 5 నుంచి సమ్మెకు వెళ్లిన కార్మికుల.. సెప్టెంబర్ మాసం వేతనాలను ఎందుకు చెల్లించలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సమ్మె కొనసాగుతున్నందున సిబ్బంది లేరని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. ఇరు వాదనలు విన్న కోర్టు సోమవారం లోపు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.

ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్నారు. జీతాల పెంపు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తదితర డిమాండ్లతో స్ట్రైక్ కి దిగారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు విధుల్లోకి రాని వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించారు. ఆర్టీసీలో 1200 మాత్రమే ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. విధుల్లోకి రాని కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఇవ్వలేదు. దీంతో కార్మికులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో వారికి ఊరట లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC Workers  TSRTC workers salaries  CM KCR  High Court  Telangana Government  Politics  

Other Articles