Ayodhya case's hearing finished, verdict reserved అయోధ్య రామ మందిరం కేసులో తీర్పు రిజర్వు..

Hearing ends in ayodhya case ends supreme court reserves verdict

Ayodhya case, Supreme Court, Ayodhya, Ramjanmabhoomi, Ram Lalla, Babri, Babri Mosque, Babri Masjid, ayodhya verdict, ayodhya news, ayodhya mandir, ayodhya hearing, Ayodhya case, Ram Mandir, Babri masjid, Verdict, Chief Justice of India, Ranjan Gogoi, India, Politics

The Supreme Court is expected to announce a verdict in the 134-year-old Ayodhya case soon, after the hearings in the Ayodhya came to an end at the Supreme Court after 40 days. The verdict in the case - which has dominated politics and the headlines for decades - is expected to come before November 17.

అయోధ్య కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు..

Posted: 10/16/2019 04:34 PM IST
Hearing ends in ayodhya case ends supreme court reserves verdict

శాతాబ్దాల క్రితం నాటి అయోధ్య రామజన్మభూమికి సంబంధించి దశాబ్దాలుగా సాగుతున్న వివాదాస్పద కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును రిజర్వు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఏర్పడిన ఐదుగురు సభ్యులు గల ధర్మసానం నలభై రోజులుగా చేపట్టిన రోజువారి వాదనలు ఇవాళ్టితో ముగిసాయి. దీంతో న్యాయస్థానం బెంచీ తీర్పును రిజర్వు చేసింది. నిర్ణత సమయం కంటే ముందుగానే ఈ కేసులో వాదనలు ముగించిన న్యాయస్థానం.. ఇప్పటికీ ఏమైనా  చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది.

చివరి రోజు విచారణ సందర్భంగా వాడీవేడిగా వాదనలు ముగిశాయి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు విషయమై హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ అయోధ్య రామజన్మ స్థానం అంటూ తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో చూపిన ఓ పుస్తకాన్ని చించేశారు. దీనిపై కోర్టులో పెద్ద రచ్చ జరిగింది. అయితే రాజీవ్ ధవన్ తన చర్యను సమర్థించుకున్నారు. సీజేఐ చెప్పడంతోనే తాను చింపివేసినట్లు ఆయన తెలిపారు. సీజేఐ కూడా దీనిని అంగీకరించారు.

అయితే శాంతి భద్రతల దృష్యా అయోధ్య నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ ను విధించారు. అయోధ్యపై సుప్రీం తీర్పుతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న సందర్భంగా మరో రెండు నెలల పాటు అయోధ్యలో 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు విధిస్తున్నట్లు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీపావళి పండగ సందర్భంగా కూడా బాణసంచాను విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు.

అయోధ్య వివాదం పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీవివాదానికి స్నేహపూర్వక పరిష్కారం కనుగొనడంలో విఫలమైన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండగా, అప్పటిలోగా ఈ మైలురాయి కేసులో ధర్మాసనం తన తీర్పును ఇస్తుందని అందరూ భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles