Hyd Multiplex Booked for 10 Mins Delay థియేటర్ యాజమాన్యానికి సినిమా చూపిన ప్రేక్షకుడు

Case against cinepolis in hyderabad for delaying movie by 10 mins

Hyderabad, Multiplex, Police, Movies, Theatres, Hyderabad Multiplex, Sai Teja, KPHB police, manjeera mall, vijay gopal, movie delay, cinepolis, Hyderabad, Crime

An FIR was filed against the Cinepolis in Kukatpally after a complaint by a citizen, who argued that delaying the screening of the film is an 'unfair trade practice' under the Telangana State Cinema Regulations Act, 1955.

థియేటర్ యాజమాన్యానికి సినిమా చూపిన ప్రేక్షకుడు

Posted: 10/16/2019 03:32 PM IST
Case against cinepolis in hyderabad for delaying movie by 10 mins

థియేటర్ యాజమాన్యానికి ఓ ప్రేక్షకుడు సినిమా చూపించిన ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో అసలు ట్విస్టు ఏంటంటే.. నిర్దేశిత సమయం కంటే సినిమా పది నిమిషాలు అలస్యంగా ప్రారంభించడమే. ఇంటకీ ప్రేక్షకుడు ఏం చేశాడంటే.. నేరుగా కేపీహెచ్బీ పోలిస్ స్టేషన్ కు వెళ్లి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ థియేటర్ పై కేసు నమోదు చేశారు. అదేంటి ప్రేక్షకుడు పిర్యాదు చేయగానే పోలీసులు ఎలా కేసు నమోదు చేశారని షాక్ అవుతున్నారా.? వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..

కూకట్ పల్లిలో నివాసం ఉండే వ్యక్తి అక్టోబర్ 8న కేపీహెచ్​బీ కాలనీలోని మంజీరా ట్రినిటీ మాల్​ లోని 3వ ఫ్లోర్లో ఉన్న సినీ పోలీస్ మల్టీప్లెక్స్ కు వెళ్లాడు. సాయంత్రం 4.40 గంటలకు గోపీచంద్ చాణక్య సినిమా స్టార్ట్ ​కావాల్సి ఉంది. అయితే థియేటర్ యాజమాన్యం ఆలస్యం చేసింది. 10 నిమిషాల పాటు యాడ్స్​ వేసింది. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన నేరుగా.. పోలీసులను ఆశ్రయించాడు. సినిమా టైమ్ లో యాడ్స్ వేసిన మల్టీప్లెక్స్ ​యాజమాన్యం, ఆపరేషన్​ మేనేజర్ పై ఫిర్యాదు చేశాడు.

తాను డబ్బులు ఖర్చు పెట్టి మరీ టికెట్ కోనుక్కుని వెళ్లి సినిమా చూస్తూంటే.. తన సమయాని వృధా చేశారని, నిర్ధేషిత సమయానికి సినిమా వేయకుండా యాడ్స్ వేసి సోమ్ము చేసుకుంటున్నారని పిర్యాదు చేశాడు. అంతేకాదు థియేటర్ యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపాడు. ఈ పిర్యాదును స్వీకరించిన పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. అనుమతి కోరారు. న్యాయస్థానం అనుమతిని ఇవ్వడంతో థియేటర్ పై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. టైమ్ ​వేస్ట్ ​చేసి ప్రేక్షకులకు ఇబ్బందులు కలిగించడం కరెక్ట్ కాదని ఫిర్యాదుదారుడు అన్నాడు.

సినిమా టైమ్ లో యాడ్స్ వేయడం చట్ట ప్రకారం నేరం అని చెప్పాడు. అలాగే తెలంగాణ స్టేట్‍ రెగ్యులేషన్‍ యాక్ట్  ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఆరోపణలతో కూకట్‍పల్లిలోని సినీ పోలిస్‍ మల్టీప్లెక్స్ మేనేజ్‍మెంట్ పై కేపీహెచ్‍బీ పీఎస్​లో కేసు నమోదు చేయించినట్లు ఫోరం ఎగనెస్ట్ కరెప్షన్‍ ఫౌండర్‍ విజయ్ గోపాల్‍ తెలిపారు. రూల్స్​ పాటించని థియేటర్‍ యాజమాన్యాలకు పోలీసులు రూ.10 వేల ఫైన్‍ వేసే అవకాశం ఉందన్నారు. సమయానికి సినిమా ప్రదర్శించకునందుకు ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Multiplex  Sai Teja  KPHB police  manjeera mall  vijay gopal  movie delay  cinepolis  Hyderabad  Crime  

Other Articles