HC urges RTC workers to call off strike సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు అదేశం

Telangana high court urges rtc workers to call off strike

TSRTC Workers, High Court, High court urges workers to call off strike, tsrtc jac, Telangana movement, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

Telangana High court urged the RTC workers Union Joint action committee to call of their strike and resolve the issues with government in legitimate fashion. As ultimately the people of the state are facing the mpact of Strike.

సమ్మె విరమించి చర్చలకు వెళ్లండి: ఆర్టీసీ జేఏసీకి హైకోర్టు అదేశం

Posted: 10/15/2019 05:32 PM IST
Telangana high court urges rtc workers to call off strike

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. ఇటు ప్రభుత్వం అటు కార్మికులు బెట్టువీడకపోవడంతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందుకులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం - యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలు తెలపడానికి అనేక మార్గాలున్నాయంటూ సూచించింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు స్పష్టం చేశారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పోరేషన్లు ముందుకొస్తాయని తెలిపింది. కార్మికుల సమ్మె ప్రజలపై పడకుంగా 6 వేల బస్సులను నడుపుతున్నామని కోర్టుకు తెలిపింది. ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

యూనియన్ తరపు నుంచి న్యాయవాది దేశాయక్ ప్రకాశ్ వాదానలు వినిపిస్తున్నారు. కార్మికుల సమస్యలపై 30 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని. ప్రభుత్వమే ఎలాంటి చర్యలు చేపట్టలేదు, ఆఖరి అస్త్రంగా సమ్మెకు వెళ్లడం జరిగిందని చెప్పారు. సమస్యలపై అనేకసార్లు విన్నపాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. నెల రోజుల నుంచి అసలు పట్టీపట్టనట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం.. ప్రజల ముందు తమను దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని వాదించారు.

సమ్మె యధాతథం: టీఎస్ఆర్టీసీ జేఏసీ

సమ్మె విరమించే ప్రసక్తే లేదని..యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ చర్చలకు పిలిస్తే వెళ్తామని చెప్పారు. అక్టోబర్ 18 వ తేదికి కేసు వాయిదా వేసింది. ఈ లోపు సమస్యల పరిష్కారమై ఇరువర్గాలు పూర్తిస్థాయిలో చర్చించుకోవాలని కోర్టు సూచించిందని తెలిపారు. ప్రభుత్వ తరపు లాయర్లను ప్రభుత్వంతో మాట్లాడాలని.. యూనియన్ తరపు లాయర్లను కార్మిక సంఘాల నేతలతో మాట్లాడాలని 18న కోర్టుకు ముందుకు రావాలని సూచించినట్లు తెలిపారు.

సమ్మె విరమించమని హైకోర్టు చెప్పలేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి తెలిపిందని గుర్తు చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపితే సమ్మె విరమణకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాలకు కోర్టు తెలిపిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవకుండా కార్మికులు సమ్మె విరమించాలంటే అది జరిగే పని కాదన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడే కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  High Court  Ashwathama Reddy  RTC Employees  TSRTC Strike  KCR  Hyderabad  Telangana  

Other Articles