TTD special darshan to senior citizens and handicapped వయోజనులకు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

Ttd special darshan to senior citizens and handicapped

tirumala, tirumala tirupati devasthanam, Dharma Reddy, additional E.O, senior citizens, handicapped, mothers, BIG Laddu, BIG Vada, devotees rush, TTD tirumala tirupati, tirumala brahmotsavam 2019

Tirumala Sri vari Lord Venkateshwara swamy Prasadam Big Laddus and big Vadas are to be available for sale not only to Recommended devotees but also to general devotees near the Prasadam counters.

వయోజనులకు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

Posted: 10/15/2019 06:27 PM IST
Ttd special darshan to senior citizens and handicapped

అఖిలాండకోటి బ్రహ్మోడనాయకునిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగుబంగారమైన.. అల శ్రీనివాసుడికి ఇల వైకుంఠమైన  తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతీ నెల రెండు రోజుల పాటు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేవలం సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులకు మాత్రమే ఇచ్చే పెద్ద లడ్డూలు, వడలు ఇకపై సామాన్య భక్తులకు కూడా అందించే నిర్ణయం తీసుకున్న కమిటీ. తాజాగా అలాంటిదే మరో నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ ప్రత్యేక దర్శనం కేవలం వయోవృద్దులకు, దివ్యాంగులతో పాటు చంటి పిల్లల తల్లులకు మాత్రమే. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వీరు.. భక్తుల రద్దీలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. వీరి కోసం నెలలో రెండు రోజులు వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 15, 29 తేదీల్లో వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు.

ఈ 2 రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఐదేళ్లలోపు చంటి పిల్లల(ఐదేళ్లలోపు) తల్లిదండ్రులకు అక్టోబర్ 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 10 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే టోకెన్లను.. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్‌లో ఉదయం 7 గంటల నుంచి మంజూరు చేస్తారు.

అలాగే ఇక ప్రతి నెల 15వ తేదీన 5ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గంలో అనుమతిస్తారు. ధారణ రోజుల్లో ఏడాది లోపు పిల్లల తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala tirupati devasthanam  tirumala  senior citizens  handicapped  mothers  devotees rush  TTD  

Other Articles