Pranjal Patil, India’s 1st Blind Woman IAS Officer దేశంలో తొలి అంధ ఐఏఎస్ అధికారిణి ఈమె..

First blind ias officer takes charge as sub collector

defeating disability, indias first visually impaired woman ias, visually impaired ias officer, pranjal patil, visual impairment, Sub collector, ias officer, Thiruvananthapuram, Kerala, Politics

On 14 October, 31-year-old Pranjal Patil, India’s first blind woman IAS officer, became the Sub-Collector of Thiruvananthapuram, Kerala.

అంధత్వాన్ని జయించి.. ఆశయాన్ని సాధించిన ప్రాంజల్ పాటిల్

Posted: 10/15/2019 04:07 PM IST
First blind ias officer takes charge as sub collector

అన్ని అవయవాలు సరిగ్గా వున్న వారిలో కన్నా పట్టుదల, మనోధైర్యం, ఏకాగ్రత దివ్యాంగుల్లోనే అధికంగా వుంటుందన్నది పెద్దలు చెప్పిన మాట. అందుకనే వారు తమలోని లోపాన్ని అధిగమించేందుకు అనన్యసామాన్యమై కార్యాలను చేస్తారని అంటారు. పెద్దల మాటలు ఎవరి విషయంలో ఏమో కానీ.. మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్ పాటిల్ విషయంలో మాత్రం నూటికి నూరుపాల్లు నిజమనే చెప్పాలి.

తనకున్న అంధత్వాన్ని జయించిన అమె ఏకంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ఉత్తీర్ణురాలైయ్యారు. అమె ఏకంగా అగ్రబాగన నిలవడంతో అమె ఐఎఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను ఎంచుకుని శిక్షణను కూడా పూర్తి చేసుకుని ఇవాళ బాధ్యతలను చేపట్టారు. దేశంలోనే తొలి అంధ ఐఏఎస్ అధికారిగా రికార్డులకెక్కారు.ఇవాళ ( సోమవారం) ఆమె కేరళ రాజధాని తిరువనంతపురం సబ్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు.

ప్రాంజల్‌ పాటిల్‌ మహారాష్ట్రలోని ఉల్‌హస్‌నగర్‌కు చెందినవారు. ఆమె తన ఆరేళ్ళ వయస్సులోనే కంటి చూపు కోల్పోయారు. ఐఎఎస్‌ కావాలన్న ఆమె లక్ష్యానికి అంధత్వం ఏ మాత్రం అడ్డంకి కాలేదు. అనేక అవరోధాలను అధిగమించి సివిల్‌ సర్వీసులకు ఎంపికైన తొలి అంధ మహిళగా నిలిచారు. ఇవాళ తిరువనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె. గోపాలకృష్టన్‌, ఇతర సిబ్బంది సమక్షంలో ఆమె బాధ్యతుల స్వీకరించారు.

సబ్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు ప్రాంజల్ పాటిల్. ప్రజల నుండి, కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది నుండి తనకు మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. 2017 సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ప్రాంజల్ పాటిల్ 124వ ర్యాంకు సాధించారు. తర్వాత 2018లో కేరళలోని ఎర్నాకుళం అసిస్టెంట్‌ కలెక్టర్ గా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranjal patil  visual impairment  Sub collector  ias officer  Thiruvananthapuram  Kerala  Politics  

Other Articles