Heavy rains lash Telugu states on 16, 17th తెలుగు రాష్ట్రవాసులకు ఛేదువార్త.. ఈశాన్యం అగమనం..

Amid entry of north east monsoon heavy rains lash telugu states on 16 17

Arabian sea, Hyderabad rain, rain in Hyderabad, weather in hyderabad, current weather in hyderabad, rain in hyderabad today live, hyderabad weather, weather in secunderabad, Telangana, Telangana weather, Telangana rains, moderate rainfall in Hdyerabad, Rains in Telangana, Rain Forecast

Telangana State is likely to receive heavy rain in the next couple of days on 16 and 17 of October. Hyderabad Meteorological Department said with the Northeast Monsoon; the northern Telangana is likely to be hit by the rains on October 16 and 17th of this month.

తెలుగు రాష్ట్రవాసులకు ఛేదువార్త.. నైరుతి పయనం.. ఈశాన్యం అగమనం..

Posted: 10/15/2019 12:31 PM IST
Amid entry of north east monsoon heavy rains lash telugu states on 16 17

తెలుగు రాష్ట్రాలకు ఇది నిజంగానే ఛేదువార్త. తెలుగు రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించినా.. ఆరంభంలో ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో రైతన్న అందోళనకు గురయ్యాడు. ఆ సమయంలో ఆలస్యంగా కరుణించిన వరుణుడు ఏకంగా తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో వర్షాలను కురిపించాడు. నైరుతి రుతుపవనాలు వెళ్లాల్సి వున్నా.. వాటి ప్రభావంతో ఏర్పడిన ఉపరితల అవర్తన ధ్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే వున్నాయి.

దశాబ్దాల తరువాత తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లు, ప్రాజెక్టుల గేట్లను పూర్తిస్థాయిలో పలు పర్యాయాలు ఎత్తి నీటిని దిగువకు వదలాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయంటే ఎంతటి వర్షపాతం నమోదైందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగర విషయాన్ని చెప్పనవసరం లేదు. ప్రతీ రోజు హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తూనే వున్నాయి. దాదాపుగా మూడున్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమౌదు అయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దయ్యాయి.
 
సరేలే ఇక నైరుతి రుతు పవనాలు నిష్క్రమిస్తున్నాయి.. ఇక ఇప్పడు సేద తీరుదాం అని భావిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ కేంద్రం మరో చేదు వార్తను అందించింది. ఇలా నైరుతి రుతుపవనాలు పవయం సాగుతున్న క్రమంలోనే అలా తెలుగు రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు అడగుపెడుతున్నాయి. అయితే వచ్చిందే తడవుగా ఇప్పటికే వున్న అనుకూల వాతావరణం నేపథ్యంలో తమ ప్రతాపాన్ని చాట్టేందుకు రెడీ అవుతున్నాయి. తెలంగాణలో ఈ నెల 17న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అయితే వీటి ప్రభావంతో 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు భారతదేశం నుంచి వీస్తున్న తేమ గాలుల వల్ల తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కాగా, ఉత్తర భారతదేశం నుంచి నిర్మల్ రామగుండం వరకు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయని, మరో రెండు రోజుల్లో ఇవి పూర్తిగా వెనక్కి వెళతాయని అధికారులు వివరించారు. వీటితో సంబంధం లేకుండానే ఈశాన్య రుతుపవనాలు వస్తున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rain  moderate rainfall  northeast monsoon  Secundrabad  hyderabad  Telangana  Rain Forecast  

Other Articles