EPFO is crediting increased interest to PF accounts మీ ఫీఎఫ్ అకౌంట్లోకి పెరిగిన వడ్డీ..

Epfo is crediting increased interest to your pf accounts check balance now

provident fund, PF balance, new interest rate, PF interest, SMS, Umang App, missed call facility, diwali, epfo, employees provident fund organisation, pf account holders, 8.65 per cent, EPF portal, www.epfindia.gov.in

The EPF0 has begun crediting interest to provident fund accounts. It is learnt that several PF account holders have already received interest credit of 8.65 per cent for the financial year 2018-2019 ahead of Diwali.

గుడ్ న్యూస్: మీ ఫీఎఫ్ అకౌంట్లోకి పెరిగిన వడ్డీ..

Posted: 10/15/2019 01:30 PM IST
Epfo is crediting increased interest to your pf accounts check balance now

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్. మీ పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ పెరిగింది. ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గానైజేషన్ (ఈపీఎఫ్ఓ, EPFO) తమ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీని పెంచడం ప్రారంభించింది. దీపావళి పండగకు ముందుగానే 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాలామంది పీఎఫ్ అకౌంట్ దారులకు 8.65 శాతం వరకు వడ్డీ క్రెడిట్ అయింది.

ఇటీవలే ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును పెంపునకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పెంపుతో 6 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్ స్రైబర్లకు ప్రయోజనం చేకూరింది. పీఎఫ్/ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎలా చెక్  చేసుకోవాలో తెలుసా? సాధారణంగా.. ఉమంగ్ (UMANG) యాప్, ఎస్ఎంఎస్, ఈఫీఎఫ్ పోర్టల్ లేదా మిస్డ్ కాల్ ద్వారా ఈజీగా మీ పీఎఫ్ అకౌంట్లలో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. ఈ కింది విధంగా ఫాలో అవ్వండి చాలు..

1. ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు :

* మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899కు SMS చేయాలి.
* మీరు పంపే మెసేజ్ EPFOHO UAN (విత్ స్పేస్) ఇలా టైప్ చేసి SMS పంపాలి.
* మీ UAN అకౌంట్ మీ KYC వివరాలకు లింక్ అయి ఉండాలి.
* యూనైటెడ్ పోర్టల్ పై రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి మాత్రమే SMS పంపాలి.

2. ఉమంగ్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చూసుకోవచ్చు :

* మీ పీఎఫ్ అకౌంట్లో పెరిగిన వడ్డీని UMANG యాప్ ద్వారా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
* UMANG ( ఉమంగ్ ) App Download చేసుకోవాలి.
* ఆండ్రాయిడ్ యూజర్లు Play Store నుంచి UMANG యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
* ఐఫోన్ (iOS) యూజర్లు.. iOS స్టోర్ నుంచి UMANG యాప్ డౌన్ లోడ్ చేసుకోండి.
* మీ EPF UAN అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
* మీ UAN రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
* OTP ఎంటర్ చేస్తే చాలు.. మీ PF బ్యాలెన్స్ కు సంబంధించి వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు.

3. EPF పోర్టల్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్ :

* www.epfindia.gov.in వెబ్ సైట్ విజిట్ చేయండి.
* ఇక్కడ మెంబర్ పాస్ బుక్ అందుబాటులో ఉంటుంది.
* Our Services కింద ఫర్ ఎంప్లాయిస్ (For Employees) ఆప్షన్ పై ఎంచుకోవాలి.
* మీ UAN User Name, పాస్ వర్డ్ తో Login కావాల్సి ఉంటుంది.
* UAN అకౌంట్ తో లింక్ అయిన అన్ని Member IDలు కనిపిస్తాయి.
* మెంబర్ ఐడీ (PF No) EPF అకౌంట్ Select చేసుకోండి.
*  EPF పాస్‌బుక్ స్ర్కీన్ ఓపెన్ చేయగానే బ్యాలెన్స్ కనిపిస్తుంది.

4. మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ చూసుకోవచ్చు :

* రిజిస్టర్ మొబైల్ నుంచి 011-22901406కు మిస్సడ్ కాల్ ఇవ్వండి.
* మీ మొబైల్ నెంబర్ UAN అకౌంటుతో లింక్ తప్పనిసరిగా ఉండాలి.
* UAN యాక్టివేట్ అయి ఉండాలి. KYC వివరాలు కూడా కంప్లీట్ అయి ఉండాలి.
* మిస్సడ్ కాల్ ఇవ్వగానే.. రెండు రింగులు వచ్చి ఆటోమాటిక్ గా కాల్ కట్ అవుతుంది.
* ఈ కాల్ కు ఎలాంటి చార్జీ ఉండదు.
* కాల్ కట్ కాగానే.. మీ మొబైల్ కు SMS రూపంలో PF బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : provident fund  EPFO  new interest rate  PF interest  diwali  pf account holders  8.65 per cent  

Other Articles