thief experinenced tit for tat on throwing brick at car తేలు కుట్టిన దొంగ.. అంటే అర్థం ఇదేనా..!

Brick thrown at car window bounces back and hits thief face

CCTV, Brick, Durham, vandel, thief, car window, tit for tat, United Kingdom, London, viral video, video viral

An alleged thief recently became victim to what could be called instant karmic retribution after attempting to break into a car by throwing a brick at the vehicle's window, only to have it bounce back and hit him squarely on the face.

ITEMVIDEOS: తేలు కుట్టిన దొంగ.. అంటే అర్థం ఇదేనా..!

Posted: 10/15/2019 11:35 AM IST
Brick thrown at car window bounces back and hits thief face

తేలు కుట్టిన దొంగ అన్న సామెత విన్నారుగా.. అయితే ఈ సామెత ఎలా వచ్చిందంటే ఎవరికీ తెలియదు కానీ.. సందర్భానుసారంగా అనేక మంది దీనిని తమ ప్రత్యర్థులపై మాత్రం వినియోగిస్తూ వుంటారు. ఆ నానుడి ఎలా వచ్చిదంటే నిలువెత్తు ఉధాహరణ ఈ వీడియో. ఎప్పటిలానే ఆ రోజు కూడా దొంగతనం చేసేందుకు వెళ్లాడా దొంగ. తాను కొద్ది సేపట్నించి ఓ కారును గమనిస్తున్నాడు. కారు ఓనర్ దానిని లాక్ చేసి ఎక్కడికో వెళ్లాడు.

కారు అద్దాలను బ్రేక్ చేసి అందులోని విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరికి అతడి ముఖమే పగిలిపోయింది. రోడ్డు పక్కన నిలిపిన కారు అద్దాలను ఇటుకతో బ్రేక్ చేయబోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఇటుక అద్దానికి తగిలి అదే వేగంతో గాల్లోకి ఎగిరి తిరిగి తన ముఖాన్ని గట్టిగా తాకింది. ముఖం పచ్చడి కావడంతో దొంగ విలవిల లాడిపోయాడు. ఈ ఘటన బ్రాండన్ లోని మార్టిన్ క్రాయాగ్ అనే వ్యక్తి ఇంటి దగ్గర జరిగింది. దీనికి సంబంధించిన వీడియో క్రాయాగ్ ఇంటి సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఆ వీడియోను క్రాయాగ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. కారు దగ్గరకు వచ్చి అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇటుక తీసుకొచ్చి గట్టిగా అద్దాలపై విసిరికొట్టాడు. కానీ, కారు అద్దాలు పగలక పోగా.. ఇటుక గాల్లోకి ఎగిరి వచ్చి అంతే వేగంతో అతడి ముఖాన్ని గట్టిగా తాకింది. ముఖంపై చేతులను అడ్డుగా పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వైరల్ అవుతున్న వీడియోను మీరు వీక్షించండీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brick  car theft  Car Thief  car window  glass  karma  viral  viral video  

Other Articles