ఫ్యాన్సీ నంబర్లు కోసం కోట్లు రూపాయలను కూడా వెచ్చించే ప్రముఖులు మన దేశంలో చాలా మందే వున్నారు. వీరిలో సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, వ్యాపారస్థులు, రాజకీయ నాయకులే అధికం. వీరి వీక్ పాయింట్ (అనవసరపు అవసరాన్ని) ఆసరగాగా తీసుకున్న ఓ ఘనుడు అదే ఫ్యాన్సీ నెంబర్ల పేరుతో వారిని నిట్ట నిలువునా ముంచేశాడు. అయితే వీడి చేతిలో అనేక మంది ప్రముఖులు మోసపోయినా.. పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అదే పంథాను కొనసాగిస్తూ.. వందల మందికి శఠగోపం పెట్టాడు.
ఒక వ్యక్తి ఇంతమందిని ఎలా మోసం చేశాడంటే.. తనకుతాను వారికి ఎయిర్ టెల్ సీఈఓ గోపాల్ అని నమ్మకం కలిగేలా వ్యవహరించడం.. ఇక ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడంతో ప్రముఖులు అతని బుట్టలో ఈజీగా పడ్డారు. ఇక తాము మోసపోయిన విషయాన్ని కూడా వారు ఎవరికీ చెప్పలేక.. కక్కలేక మింగలేక అన్న పరిస్థితిలో చిక్కుకున్నారు. పరువు పోతుందని, డబ్బు పోయినా పర్వాలేదని అనుకున్న పెద్ద తలకాయలనే వీడి టార్గెట్ చేసి జల్సాలకు అలవాడు పడ్డాడు. ఒక్క బాధితుడి పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘరానా మోసగాడిని పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన మద్దెల దీపుబాబు.. హైదరాబాద్‌కు చెందిన జానకీరామ్ అనే వ్యక్తికి సెప్టెంబర్ 19న మొబైల్ ఫ్యాన్సీ నంబర్లు కావాలా? అంటూ ఫోన్ చేశాడు. తన దగ్గర ఫ్యాన్సీ నంబర్లు ఉన్నాయని, తక్కువ ధరకే ఇస్తానంటూ చెప్పి తర్వాత 9899999999, 9123456789, 9999999099, 9999999999 నంబర్లను మెసేజ్ చేశాడు. ఎయిర్టెల్ సీఈఓని అని చెప్పి నమ్మించి గోపాల్ అనే పేరుతో పరిచయం చేసుకున్నాడు.
ఫ్యాన్సీ నంబర్లపై ఇద్దరు మాట్లాడుకొని చేసుకొన్న ఒప్పందం ప్రకారం రూ.45వేల 800 డబ్బును అతడు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశాడు జానకీ రామ్. డబ్బు డిపాజిట్ అయిన వెంటనే సదరు వ్యక్తి స్పందించలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మోసపోయానని గ్రహించిన జానకీరామ్.. సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ బీ మధుసూదన్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టి నిందితుడిని బెంగళేరులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చారు.
నిందితుడు మద్దెల దీపుబాబు 2014 నుంచి మొబైల్ ఫ్యాన్సీ నంబర్ల పేరుతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీల డైరెక్టర్లే లక్ష్యంగా మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. ప్రజాప్రతినిధులకు ఫోన్‌చేసి ఎయిర్టెల్ సీఈవోనంటూ పరిచయం చేసుకోవడం, బురిడీ కొట్టించడం పనిగా పెట్టుకొన్నాడు. ఫోన్ చేస్తున్న వ్యక్తి నిజంగా ఎయిర్టెల్ సీఈవో గోపాల్ అని భ్రమపడేట్టుగా ట్రూకాలర్ ఐడీని ఫీడ్ చేసుకున్నాడు.
బ్యాంకు ఖాతా పేరును ఎయిర్టెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పడంతో అందరూ అతని మాటలు నమ్మి మోసపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతడి వలకు చిక్కిన ఎమ్మెల్యే ఒకరు రూ.3లక్షలు, ఎమ్మెల్సీ ఒకరు రూ.2లక్షల సమర్పించుకున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మోసపోయిన ప్రజాప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో దీపుబాబు మరింత మందిని మోసం చేసినట్లుగా తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Feb 27 | సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెలసినన ఇల వైకుంఠపురంగా భక్తుల కొంగుబంగారంగా నిలిచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తిరువేంకటేశ్వరుడికి ఆర్జిత సేవలు నిర్వహించేందుకు భక్తులు అసంఖ్యాకంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు... Read more
Feb 27 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ను మరో రకంగా చూడటం... Read more
Feb 27 | తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరుల త్యాగాల మీద అడుగులు వేసుకుంటూ అధికారాన్ని చేపట్టిన కేసీఆర్.. తెలంగాణ అంటే తానొక్కడే అన్న చరిత్రను... Read more
Feb 26 | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు తాజా షెడ్యూల్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ... Read more
Feb 26 | యావత్ దేశం ఇంధన ధరల పెంపుపై భగ్గుమంటోంది. ప్రజలను ఇంధన ధరల పెంపుపై పెదవి విరుస్తుండగా, ఈ ధరాఘాతాన్ని విపక్షాలు తమ తమ స్థాయిలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో... Read more