ysrcp govt to impliment new excise policy జగన్ సర్కారుపై మందుబాబులు గరం.. గరం..

Ysrcp govt to cut liquor bottles storage in house to 50 percent

AP new excise policy, upper middle class, upper class, CM YS Jagan, liquor policy, Andhra Pradesh, politics

Andhra pradesh government to impliment new excise policy from october 1st. ysrcp govt also cuts the liquor bottles storage in house to 50 percent ie to 3 bottles.

జగన్ సర్కారుపై మందుబాబులు గరం.. గరం..

Posted: 09/26/2019 05:33 PM IST
Ysrcp govt to cut liquor bottles storage in house to 50 percent

ఆంధ్రప్రదేశ్ లో మద్యంబాబులు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. అయితే రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు విషయాన్ని పక్కన బెడితే.. కాసింత ఎగువ మధ్యశ్రేణి కుటుంబాలకు చెందిన మద్యంబాబులతో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ ఓట్లు కూడా ఒక కారణమని.. దానిని విస్మరించిన సర్కార్ తమనే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

అదేంటి ఈ ఎగవ మధ్యతరగతి, ఉన్నత వర్గ మద్యంబాబులకు వైఎస్ సర్కార్ ఇచ్చిన షాక్ అలాంటిది మరీ. అదేంటి అంటే..  ఇప్పటివరకు సాగినట్లుగా ఇష్టం వచ్చినట్టు ఇంట్లో బార్ పెట్టుకుంటామంటే కుదరదని ప్రభుత్వం తాజాగా అదేశాలను జారీ చేసింది. ఇకపై ఏ వ్యక్తి అయినా తన ఇంట్లో కేవలం మూడు బాటిళ్లకు మించి మద్యాన్ని నిల్వ చేసుకోవడానికి వీలులేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నూతన విధానాలను అమల్లోకి తీసుకువచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బెల్ట్ షాపులను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల వద్ద నుంచి భారీ ఎత్తున సరుకుని కొనుగోలు చేసే కొందరు వ్యక్తులు.. వాటిని ఇంటి వద్ద విక్రయించే అవకాశం ఉంది. అలాంటి వారిని కట్టడి చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఈ కొత్త ఆర్డర్స్ ఇచ్చింది.

గతంలో వ్యక్తులు ఆరు బాటిళ్ల వరకు మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచుకునేందుకు అవకాశం ఉండేది. అయితే జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు పర్చేపనిలో భాగంగా తాజాగా ఆ సంఖ్యను సగానికి తగ్గించింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.

తొలి దశలో బెల్ట్ షాపులను మూయించారు. బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు జరగకుండా, కల్తీ మద్యం లేకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మద్యాన్ని ప్రభుత్వం దుకాణాల్లోనే విక్రయించేలా కొత్త పాలసీని తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన మధ్యం విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. మద్యాన్ని విక్రయించే దుకాణాల్లో పని చేసేందుకు ఉద్యోగులు నియమించుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles