pawan-kalyan-slams-on-ycp-and-tdp-govt గ్ప్రజాధనంతో సొంతడబ్బా.. వైసీపీ, టీడీపీలపై పవన్ ఫైర్..

Pawan kalyan slams on ycp and tdp govt on wastage of peoples money

pawan kalyan slams cm jagan and Chandrababu, pawan slams TDP and YSRCP, pawan fires on AP Government, pawan kalyan fires on YS Jagan govt, Pawan Kalyan, Janasena, YS Jagan, chandrababu, AP Government, YSRCP, TDP, Andhra Pradesh, Politics

Jana Sena party President Pawan Kalyan slams on CM YS jagan and previous Chandrababu in doing publicity with peoples money being the ruling party.

ప్రజాధనంతో సొంతడబ్బా.. వైసీపీ, టీడీపీలపై పవన్ ఫైర్

Posted: 09/26/2019 04:32 PM IST
Pawan kalyan slams on ycp and tdp govt on wastage of peoples money

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంద్ర ప్రదేశ్ లోని ప్రస్తుత వైఎస్సార్ ప్రభుత్వం విమర్శలు కురిపించాడు. అధికారంలోకి వచ్చి ప్రజల కోసం ప్రతీ పైసాను వెచ్చించాల్సిన ప్రభుత్వాలు.. పథకాల పేరుతో ప్రచారం కూడా చేసుకోవడంపై దుయ్యబట్టారు. ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వంపై జనసేన పార్టీ  సెటైర్లు విసిరింది. నాటి, నేటి ప్రభుత్వాల పాలనలో రాష్ట్రంలో ప్రజాధనం వృథా అయిందని, అవే డబ్బా ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.

‘అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ’ అంటూ రెండు రక్షిత మంచినీటి పథకం ట్యాంకుల ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఒక ట్యాంక్ కు పసుపు రంగు.. మరో ట్యాంక్ కు నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసి ఉండటం స్పష్టంగా కనపడుతుంది. ‘అవే డబ్బా ప్రచారాలు, ప్రజాధనంతో రంగులు వేసుకోవడాలు’, ‘దొందూ దొందే’ అని ఆయా పార్టీలను విమర్శించారు. రెండు పార్టీలు అధికారంలో వుండగా, ప్రజాధనంలో ప్రచారం చేసుకున్నాయని ఆయన మండిపడ్డారు.

ఇక తన ఆరోగ్యం బాగాలేదంటూ ఓ లేఖ విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం విజయవాడలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి తాను రాలేకపోతున్నానని వెల్లడించారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్రగాయాలయ్యాని, ఇప్పటికీ ఆ నొప్పి వీడడంలేదని వివరించారు. ఎన్నికల సమయంలో ఆ నొప్పిని అలక్ష్యం చేయడంతో గాయాల తీవ్రత మరింత పెరిగిందని, డాక్టర్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారని పవన్ తన లేఖలో తెలిపారు.

అయితే సంప్రదాయ వైద్యవిధానాల పట్ల నమ్మకంతో సర్జరీ చేయించుకోదలచుకోలేదని వెల్లడించారు. ప్రస్తుతం వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మూడు రోజులుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని, మీడియా మిత్రులు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరుకాలేనని వివరించారు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి నా తరఫున, జనసైనికుల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది అంటూ లేఖలో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  YS Jagan  chandrababu  AP Government  YSRCP  TDP  Andhra Pradesh  Politics  

Other Articles