celebrities pay tributes to venu madhav ఫిల్మ్ ఛాంబర్ లో వేణుమాధవ్ పార్థీవదేహం.. ప్రముఖుల నివాళి

Film and political celebrities pay tributes to venu madhav

Comedian Venu Madhav, Rajashekar, last photo, jeevitha, Dr. Paramanandaiah Students Gang, Sampradayam, secunderabad, Venu Madhav, Venu Madhav age, Venu Madhav comedy, Venu Madhav dead, Venu Madhav death, Venu Madhav dies, Venu Madhav news, Venu Madhav passes away, Venu Madhavdeath today, venu madhav latest news, tollywood Comedian, tollywood, movies, entertainment

tollywood celebrities and political leaders pay their tributes to Popular Tollywood comedian Venu Madhav at Film Chamber.

ఫిల్మ్ ఛాంబర్ లో వేణుమాధవ్ పార్థీవదేహం.. ప్రముఖుల నివాళి

Posted: 09/26/2019 03:46 PM IST
Film and political celebrities pay tributes to venu madhav

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులతో పాటు క్యారెక్టర్ అర్టిస్టుల వరకు సినిమా సెట్లతో పాటు అఫ్ సెట్ లోనూ అందరినీ నవ్వించిన నిజమైన కామెడియన్ వేణుమాధవ్ ఆకస్మిక మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా వేణుమాధవ్ తో తమ అనుబంధాన్ని ప్రతి ఒక్కరు పంచుకున్నారు. ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ కు ఆయన బౌతికఖాయాన్ని తీసుకువచ్చి సినీమాతో అనుబంధం వున్న అందరి సందర్శనార్థం వుంచారు.

ఇక్కడకు భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు తరలివచ్చి హాస్యనటుడు వేణుమాధవ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. వేణుమాధవ్ పార్థివదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకొచ్చారు. ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో టెంట్‌లు ఏర్పాటుచేసి వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఉంచారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ, సినీనటుడు మురళీమెహన్ సహా పలువురు వేణుమాధవ్ కు నివాళులర్పించారు.

రాజశేఖర్, జీవిత, రాజీవ్ కనకాల, నాగబాబు, రఘుబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, దర్శకుడు కరుణాకరన్, ఉదయభాను తదితర సినీ ప్రముఖులు వేణుమాధవ్ పార్థివదేహం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. అయితే, వేణుమాధవ్ మృతదేహాన్ని చూసి ఉదయభాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్ల పర్యంతమయ్యారు. కాగా, సినీ ప్రముఖుల నివాళులర్పించిన అనంతరం వేణుమాధవ్ పార్థివదేహాన్ని మౌలాలిలోని లక్ష్మీనగర్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఈ సాయంత్రం వేణుమాధవ్ కు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venu madhav  comedian  passes away  Rajashekar  last photo  chiranjeevi  pawan kalyan  jeevitha  tollywood  

Other Articles