Kumaraswamy sensational critics on PM Modi ‘‘మోడీ ఎక్కడ కాలుపెడితే అక్కడ నాశనమే..’’

Pm modi s presence at isro bad luck for scientists says kumaraswam

Prime Minister Narendra Modi, PM Modi at ISRO, Kumaraswamy on PM Modi, ISRO, Chandrayaan 2, Vikram lander connection, PM Modi, HD Kumaraswamy, Tom Vadakkan, ISRO, chandrayaan 2, bad luck, Indian Economy, karnataka, politics

Former Karnataka CM Kumaraswamy is back in the headlines, for his scathing attack against PM Modi. He stated that PM Modi’s presence at ISRO was bad luck which is why the connection to Chandrayaan 2’s lander Vikram was lost.

‘‘మోడీ ఎక్కడ కాలుపెడితే అక్కడ నాశనమే..’’ మాజీ సీఎం ఘాటు వ్యాఖ్యలు

Posted: 09/13/2019 10:13 AM IST
Pm modi s presence at isro bad luck for scientists says kumaraswam

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమవుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు ఇస్రో కేంద్రంలో మోదీ కాలుపెట్టిన వేళా విశేషం కారణంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ 2 విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్రోలో అడుగుపెట్టిన కారణంగా శాస్త్రవేత్తలను శని పట్టుకుందని అన్నారు.

చంద్రయాన్-2 ఘనత తనదేనని చెప్పుకోవడానికే మోదీ బెంగళూరు వచ్చారని కుమారస్వామి ఆరోపించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి అమోదం తెలిపింది యూపీఏ ప్రభుత్వమని, 2008-09 లోనే ఈ మేరకు చంద్రయాన్ కోసం నిధులు కేటాయించారని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాస్త్రవేత్తలు 12 ఏళ్లు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. అయితే ప్రధాని మోదీ కారణంగా అంతా నాశనం అయిందని తెలిపారు.

మైసూరులో జరిగిన ఓ సభలో కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా, ప్రధాని నరేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత అససుద్దీన్ ఒవైసీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి కౌ (గోవు) ఎకానమి గురించి తెలిసినంద.. ఇండియన్ అకానమీ గురించి తెలియడం లేదని అన్నారు. భారత అర్థికరంగం తిరోగమనంలో కొనసాగడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దీనికి ప్రధాని మోడీ కూడా అంతే ధీటుగా.. సాధు జంతువైన ఆవు పేరు చెబితేనే కొందరికి వణుకు పుటుతోందని బదులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  kumaraswamy  ISRO  chandrayaan 2  bad luck  Indian Economy  karnataka  politics  

Other Articles