janasena to release report over ysrcp rule జగన్ సర్కారు పాలనపై నివేదికకు జనసేన ఫిక్స్..

Janasena chief pawan kalyan to release report over 100 day ysrcp rule

pawan kalyan, janasena, YS Jagan, 100 day rule, amaravati, palnadu, polavaram, andhra pradesh, politics

janasena chief pawan kalyan is ready to release report over 100 days ysrcp rule on september 14 amid amaravati capital region and palnadu agitations.

జగన్ సర్కారు పాలనపై నివేదికకు జనసేన ఫిక్స్.. వాట్ నెక్స్ట్.?

Posted: 09/13/2019 09:28 AM IST
Janasena chief pawan kalyan to release report over 100 day ysrcp rule

వైఎస్సార్‌సీపీ పాలనపై నివేదిక ఇచ్చేందుకు సిద్ధమయ్యింది జనసేన. ఈ నెల 14న అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా.. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఈ నివేదికను ప్రజల ముందు ఉంచబోతున్నారు. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన 100 రోజుల గడువు ముగియడంతో నివేదిక ఇచ్చేందుకు జనసేనాని సిద్ధమయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ప్రకటనను ట్వీట్ చేసింది.

ఈ నెల 14న ఉదయం.. 11 గంటలకు పవన్‌ కళ్యాణ్‌ వైఎస్సార్‌సీపీ 100 రోజుల పాలనపై నివేదికను ప్రజల ముందు ఉంచుతారని తెలిపారు. ఈ వంద రోజుల్లో వైఎస్సార్‌సీ ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల పని తీరును అధ్యయనం చేయడానికి పార్టీలోని నేతలు, నిపుణులతో పది బృందాలను పవన్‌ కళ్యాణ్‌ నియమించారు. వీరు తమ అధ్యయనాలను పూర్తి చేసి నివేదికలను అధినేతకు అందజేశారట.

నేతలు సమర్పించిన నివేదికల్లోని ముఖ్యాంశాలను క్రోడీకరించి అమరావతిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో.. నివేదికను ప్రజలకు తెలియచేయాలని శ్రీ పవన్‌ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, వివిధ వర్గాల వారిని కలుసుకుంటారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. జనసేనాని తన నివేదికలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  YS Jagan  100 day rule  amaravati  palnadu  polavaram  andhra pradesh  politics  

Other Articles