Gloom and doom situation for economy: Former PM తాత్కాలిక మెరుగులు ఉపద్రవాన్ని అడ్డుకోలేవు: మాజీ ప్రధాని

Manmohan singh 5 trillion economy by 2024 looks like pipe dream

manmohan singh, manmohan singh economy, economic slowdown, manmohan singh on economic slowdown, manmohan singh interview, former pm interview, manmohan singh, demonetisation, goods and services tax, nirmala sitharaman, india economic crisis

Manmohan Singh said the atmosphere in the country is one of “gloom and doom”, and that Prime Minister Narendra Modi’s talk of making India a $5-trillion economy by 2024 looks like a “pipe dream”.

దేశ అర్థిక వ్యవస్థ పునరుద్దరణకు మాజీ ప్రధాని సూచనలు

Posted: 09/13/2019 12:02 PM IST
Manmohan singh 5 trillion economy by 2024 looks like pipe dream

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే నిర్ణయాలను తీసుకుందని.. ఈ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో తీవ్రంగా విఫలమైందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరోపించారు. తక్షణం కేంద్రం దిద్దుబాటు చర్యలను తీసుకోవాలని.. ఇలా చేస్తేనే కొన్నేళ్ల తరువాత వ్యవస్థ గాడిలో పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవాల్ని కప్పిపుచ్చడం మానేయాలని హితవు పలికారు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితికి మానవ తప్పిదమే కారణమని మన్మోహన్ సింగ్ ఆరోపించారు.

ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొని ఉందని అంగీకరించడమే తొలి దిద్దుబాటు చర్యగా ఆయన పేర్కోన్నారు. ఇప్పటికే సమయం మించిపోయిందని, కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం వాస్తవాల్ని అంగీకరించి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాని సూచించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి పలు సూచనలు చేశారుప. అందులో భాగంగా జీఎస్టీని హేతుబద్ధీకరించాలని దీని ద్వారా స్వల్పకాలికంగా ఆదాయం తగ్గినా.. దీర్ఘకాలంలో వ్యవస్థను గాడిలో పెట్టొచ్చునన్నారు.

వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించడం ద్వారా గ్రామీణ ప్రజల వినిమయ శక్తిని పెంచాలి. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యల్ని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచామని మన్మోహన్‌ అన్నారు. విపణిలో ద్రవ్య లభ్యత సమస్యను పరిష్కరించాలని.. జాతీయ బ్యాంకులతో పాటు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటున్నాయని అన్నారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఎగుమతుల్ని మరింత పెంచే ప్రయత్నం చేయాలి.

ప్రభుత్వానివి తాత్కాలిక మెరుగులు..

అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు, వివిధ రాష్ట్రాల నాయకులతో జరిగిన సమావేశంలో సోనియాగాందీతో పాటు మన్మోహన్‌ సింగ్‌ పాల్గొన్నారు. 2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలన్న ప్రధాని మోదీ లక్ష్యం నెరవేరేలా లేదని మన్మోహన్‌ అన్నారు. లక్ష్యాన్ని చేరాలంటే తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదుకావాలన్నారు. కానీ, ఇప్పుడు అది ఐదు శాతం వద్దే ఊగిసలాడుతోందన్నారు.

వాహనరంగానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక ప్యాకేజీతో ముందుకు రావాలన్నారు. లేదంటే 10లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటివరకు కేంద్ర చేపట్టిన చర్యలన్నీ తాత్కాలికమైనవని అన్నారు. వచ్చే ఉపద్రవాన్ని ఏమాత్రం అడ్డుకోవడానికి ఉపకరించబోవన్నారు. ఇదే విషయాన్ని ఆర్థిక నిపుణులు, సంస్థలు సైతం చెబుతున్నాయన్నారు. కేంద్ర ప్రకటనలన్నీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles