Chandrababu under house arrest అరెస్టులతో ‘‘ఛలో ఆత్మకూరు’’ ఆపలేరన్న టీడీపీ అధినేత

Chandrababu naidu under house arrest to foil protest march

chandrababu naidu, TDP, House arrest, nara lokesh arrest, Chalo Atmakur, Andhra Pradesh, Politics

To foil the ‘Chalo Atmakur’ call given by the Telugu Desam Party, the police deployed additional forces at Leader of the Opposition N. Chandrababu Naidu’s residence, located on the banks of Krishna River, at Undavalli in Guntur district.

చంద్రబాబు హౌజ్ అరెస్టు.. ఉండవల్లిలో ఉద్రిక్తత

Posted: 09/11/2019 12:36 PM IST
Chandrababu naidu under house arrest to foil protest march

తెలుగుదేశం తలపెట్టిన ఛలో ఆత్మకూరు అందోళన నేపథ్యంలో ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. ఆత్మకూరుకు చేరుకునేందుకు బయలుదేరుతున్న చంద్రబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసిన పోలీసులు... గేట్లను తాళ్లతో కట్టేశారు. గేటు వెలుపల భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల చంద్రబాబు, నారా లోకేశ్ తో పాటు పలువురు కీలక నేతలు, పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు ఉన్నారు.

ఇంటి నుంచి బయటకు రావడానికి చంద్రబాబు తన వాహనంలో కూర్చున్నప్పటికీ... పోలీసులు గేటు తీయలేదు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ఆయన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నిర్బంధం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని అన్నారు. తనను ఇంట్లో పెట్టి 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని ఆపలేరని మండిపడ్డారు.

ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా? అని నిలదీశారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజని పేర్కొన్నారు. పునరావాస శిబిరానికి ఆహారం సరఫరా అడ్డుకుంటారా? అని మండిపడ్డారు. శిబిరాల్లో బాధితులకు ఇచ్చే ఆహారం అడ్డుకోవడం అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల పట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఒక పవిత్ర లక్ష్యం కోసం తాము పోరాటం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

సొంత ఊళ్లో నివసించే హక్కు కోసం చేస్తున్న పోరాటమన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. న్యాయం చేయాలని కోరితే తెదేపాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. మనం నిరంకుశ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని నిలదీశారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేయాలని కార్యకర్తలను కోరారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  TDP  House arrest  nara lokesh arrest  Chalo Atmakur  Andhra Pradesh  Politics  

Other Articles