revanth calls pawan agianst nallamalla miningనల్లమల కోసం కలసిరావాలని జనసేనకు రేవంత్ పిలుపు

Revanth reddy calls pawan kalyan to join fight against nallamalla mining

Nallamalla Uranium mining, congress agitation against uranium mining, uranium mining in nallamalla,Revanth Reddy, Jana Sena, Pawan Kalyan, Congress, Nallamalla, Uranium mining, Telangana, Politics

Congress Malkajgiri MP and Pradesh congress committe working president Revanth Reddy calls JanaSena chief Pawan Kalyan to join fight against Nallamalla Uranium mining

నల్లమల కోసం కలసిరావాలని జనసేనకు రేవంత్ పిలుపు

Posted: 09/11/2019 11:12 AM IST
Revanth reddy calls pawan kalyan to join fight against nallamalla mining

తెలంగాణ పర్యావరణానికి విఘాతం కలిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అన్ని పార్టీలు కలసి అడ్డుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అన్ని పార్టీలు కలసిరావాలన్న ఆయన.. పర్యావరణహితాన్ని ప్రత్యేకంగా తన పార్టీ సిద్దాంతంగా ప్రస్తావించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ కు పిలుపునిచ్చారు. ఆయన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని  అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ రేవంత్ ఈ పిలుపునిచ్చారు.

మన రాష్ట్రానికి ఊపిరి లాంటి నల్లమలను కాపాడుకుందామని అన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను స్థానిక చెంచులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ బతకుదెరువే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే చెంచులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చెంచులు ఈ విషయాన్ని జనసేన దృష్టికి కూడా తీసుకొచ్చినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. జీవవైవిధ్యం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలతో క్యాన్సర్‌, మూత్రపిండ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ నేతలు సోమవారం బంద్ నిర్వహించారు.

దీనికి విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు మద్దతు ప్రకటించారు. అచ్చంపేటలో నిరసనకారులు శ్రీశైలం -హైదరాబాద్ హైవేపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను లాక్కెళ్లారు. పలువురు నేతలను అరెస్టు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు (వీహెచ్) జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయణ్ని కోరారు.

యురేనియం తవ్వకాలు జరపకండీ: పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దే వద్దని పవన్‌ అన్నారు. ఈ అంశంపై అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. యురేనియం తవ్వకాలతో కృష్ణా జలాలు కలుషితమవుతాయని.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని పవన్‌ చెప్పారు. యురేనియం తవ్వకాలపై అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని, పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులతో మాట్లాడి ప్రజల్లోకి వెళ్తామని పవన్‌ వెల్లడించారు.

యురేనియం తవ్వకాలు రెండు తెలుగు రాష్ట్రాల సమస్య అని వీహెచ్ అన్నారు. దీంతో నల్లమల ప్రాంతంలో జీవవైవిధ్యం దెబ్బతిని జంతువులు మృత్యువాత పడతాయన్నారు. యురేనియం తవ్వకాల అంశంపై అఖిల పక్ష భేటీలో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని వీహెచ్‌ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Jana Sena  Pawan Kalyan  Congress  Nallamalla  Uranium mining  Telangana  Politics  

Other Articles

 • Kodela siva prasada rao last rites to be conducted tomorrow

  కొడెల శివప్రసాద్ అంత్యక్రియల్లో సందిగ్థత..

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం తన తండ్రి మరణవార్త తెలుసుకుని గుంటూరుకు తిరుగుప్రయాణమయ్యారు. రేపటిలోగా ఆయన గుంటూరుకు చేరుకుంటారని మాజీ మంత్రి, టీడీపి నేత... Read more

 • Kancheti sai sensational allegations on kodela siva prasad rao suicide

  కొడెల శివప్రసాద్ ఆత్మహత్యపై కంచేటి సాయి అరోపణలు

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని సమాచారం. అయితే రకరకాల ఊహాగానాలు... Read more

 • Ys jagan tweet on devipatnam boat capsize viral on net

  దేవీపట్నం ప్రమాదంపై అప్పటి జగన్ ట్వీట్ వైరల్..!

  Sep 16 | గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటన జరిగి, 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన నేపథ్యంలో, ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి... Read more

 • Reason behind boat capsize in river godavari dozens still missing

  గోదావరి నదిలో లాంచీ ప్రమాదానికి కారణం అదేనా.?

  Sep 16 | పాపికొండలు విహార యాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం ఉన్నప్పటికీ.. పర్యాటకుల బోటుకు ఎలా అనుమతి ఇచ్చారనే... Read more

 • Ap bjp president kanna laxminarayana taken into custody

  కన్నాను అడ్డుకున్న పోలీసులు.. సభకు అనుమతి నిరాకరణ

  Sep 16 | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి బీజేపీ ప్రయత్నించగా ఆ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.... Read more

Today on Telugu Wishesh