DGP charged with Traffic challan by sangareddy police తమ బాస్ కే ట్రాఫిక్ చలానా పంపిన పోలీసులు

Dgp charged with challan by sangareddy police for wrong side drive

DGP challaned for wrong route driving, police boss challaned for wrong droute drive, mahender reddy challaned, wrong route challan, Telanagana police boss, Mahender reddy, dgp vehicle wrong route, Challan, Traffic Police, social media

Telangana police boss ie, director general of police mahender reddy is charged with challan by sangareddy traffic police of Telangana for wrong side drive.

తమ బాస్ కే ట్రాఫిక్ చలానా పంపిన పోలీసులు

Posted: 09/07/2019 07:32 PM IST
Dgp charged with challan by sangareddy police for wrong side drive

చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయం మరోమారు రూడీ అయ్యింది. మొన్నామధ్య ఇన్ ఆర్బీట్ మాల్ వద్ద జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు రోడ్డుపైనే నిలిపివేయడంతో సైబరాబాద్ పోలీసులు చాలానా వేసిన విషయం తెలిసిందే. ఇక నవాబ్ పేట్ ఎమ్మెల్యే  యాదయ్య కారును కూడా ఆపి జరిమానా విధించడంతో పాటు బ్లాక్ ఫిల్మ్ తీయించారు. అంతేకాదు నగరం పోలీసులు సినీనటులు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా టాలీవుడ్ పెద్దహీరోలకు కూడా జరిమానా విధించి విషయం తెలిసిందే.

దీంతో చట్టం ముందు అందరూ సమానులేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందేమోకానీ పోలీసు ఉన్నతాధికారులు మాత్రం కాదు. అంతేందుకు పోలీసులే దర్జాగా తమ పోలీసు శాఖ వాహనాలను వేసుకుని రాంగ్ రూట్లో వెళ్తుంటారు. వారినెవరు ప్రశ్నిస్తారు అంటారా.? సారీ.. పోలీసుల వాహనాలే కాదు ఉన్నతాధికారుల వాహనాలను అంతేందుకు ఏకంగా పోలీస్ బాస్ వాహనానికే తమ బాస్ కారునే వదల్లేదు. అదేంటి వాళ్ల బాస్ ఎవరూ అంటారా.?

తెలంగాణ రాష్ట్ర పోలిస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని విషయం తెలిసిందే, ఆయన కారు రాంగ్ రూట్ లో వెళ్లినా టాఫిక్ పోలీసులు వదిలేయలేదు.. జరినామా విధించి శభాష్ అనిపించుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా, అది తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల మేరకు రూ.1,135 ల జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles