95 pc of mission accomplished: ISRO చంద్రయాన్-2 95 శాతం సక్సెస్: ఇస్రో చైర్మన్

Chandrayaan 2 mission very close to 100 success says isro chief k sivan

PM Modi consoles isro chairman, ISRO chairman Shivan broke-out, PM Modi urges nation to back ISRO, Chandrayaan-2, PM Modi, Shivan, ISRO Chairman, Vikram lander, ground station, landing, foreign affairs, politics

“The Chandrayaan-2 mission is very close to 100 per cent success, “Regarding technology demonstration, we could go up to 2 km from 30 km, and only the final phase could not be demonstrated properly” Isro Chairman K Sivan told.

సంపూర్ణ విజయానికి చేరుకోలేకపోయాం: ఇస్రో చైర్మన్

Posted: 09/07/2019 06:32 PM IST
Chandrayaan 2 mission very close to 100 success says isro chief k sivan

భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం కాస్తలో విఫలమైంది.  చంద్రుని ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ అనుకోని రీతిలో మొరాయించింది. లేకుంటే చంద్రయాన్-2 ద్వారా భారత కీర్తిపతాక విశ్వవీధిలో మరోసారి రెపరెపలాడేది. ఈ ప్రయోగం తీరుతెన్నులపై ఇస్రో చైర్మన్ శివన్ స్పందించారు. మీడియా ముందుకొచ్చిన ఆయన ఈ ప్రక్రియ చివరి నిమిషాల్లో తమ ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు.

చివరి దశ తాము అనుకున్న విధంగా సాగలేదని, విక్రమ్ ల్యాండర్ తో సంబంధాల పునరుద్ధరణకు తాము చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉందని తెలిపారు. అయితే, ఊరట కలిగించే విషయం ఏమిటంటే, విక్రమ్ ల్యాండర్ ను మోసుకెళ్లిన ఆర్బిటర్ మాత్రం ఇంకా చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది ఆయన తెలిపారు.

ముందు నిర్దేశించిన విధంగా ఆర్బిటర్ కాలావధి ఏడాది మాత్రమేనని, అయితే, అందులో ఇప్పుడు అదనపు ఇంధనం ఉన్న దృష్ట్యా ఏడున్నరేళ్ల వరకు అది పనిచేయవచ్చని అంచనా వేస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. ఆర్బిటర్ అందించే సమాచారం కూడా ఎంతో ఉపయుక్తమేనని భావిస్తున్నామని తెలిపారు. కాగా చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు అందించడం మానేయడంతో శివన్ కన్నీళ్ల పర్యంతం కాగా, ప్రధాని ఆయనను ఓదార్చిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrayaan-2  PM Modi  Shivan  ISRO Chairman  Vikram lander  ground station  landing  foreign affairs  politics  

Other Articles