Auto driver challaned for helmetless driving అటోడ్రైవర్ కు ట్రాఫిక్ పోలీసుల జరిమానా.? ఎందుకో తెలుసా.?

Auto driver challaned by traffic police for helmetless driving

Auto Driver challaned for helmetless drive, Auto driver fined Auto driver, challan, helmet, three town police station, traffic police, vijayawada, Andhra pradesh, crime

An auto driver was shocked after he was charged by Vijayawada Traffic Police for driving auto with out wearing helmet.

అటోడ్రైవర్ కు ట్రాఫిక్ పోలీసుల జరిమానా.? ఎందుకో తెలుసా.?

Posted: 09/07/2019 08:27 PM IST
Auto driver challaned by traffic police for helmetless driving

ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలి.. కారు, ఇతర వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.. మరీ ఆటో నడిపేవారికి ఎలాంటి అంక్షలు లేవు. అందులోనూ మురీముఖ్యంగా నలుగురు కూర్చునే అటోలో సీటు బెల్టు కూడా వుండదు. మరి వాళ్లు ఏం ధరించాలి..? అంటే విజయావాడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ పెట్టుకుని మరీ అటోను నడపాలని చెబుతుంటారు.

తమిళనాడు ట్రాఫిక్ పోలీసులు కారులో వెళ్లిన వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదని చాలాన్ పంపిరన్న విషయాన్ని తెలుసుకున్నారో ఏమో కానీ.. విజయవాడ పోలీసులు మరో అడుగుముందుకేసీ మరీ ఆటోవాలాను హెల్మట్ పెట్టుకోలేదని జరిమానా విధించారు. దీంతో ఇకపై ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లు కూడా హెల్మెట్లు, సీటు బెల్టులు పెట్టుకోవాలేమో.. లేదంటే ట్రాఫిక్ పోలీసులకు భారీగా జరిమానా సమర్పించుకోవాల్సిందేనా.? అంటూ వారు నివ్వెరపోతున్నారు.

తాజాగా విజయవాడలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. విజయవాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి ఏపీ 16 టీఎస్ 8597 నంబర్ తో తిరుగుతున్న ఆటోపై ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. అయితే సిగ్నల్ జంప్ చేశాడనో, ఓవర్ లోడ్ తో వెళుతున్నాడనో కాదు. అతను ఆటో నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. విషయం ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారు స్పందిస్తూ..‘ సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Auto driver  challan  helmet  three town police station  traffic police  vijayawada  Andhra pradesh  crime  

Other Articles