Pawan Kalyan vows to fight for Amaravati farmers రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పవన్

Janasena chief pawan kalyan to meet modi and shah over amaravati

PM Modi, Amit Shah, JanaSena, pawan kalyan, pawan kalyan amaravati farmers meet, janasenani amaravati farmers meet, amaravati farmers raises issue with janasena chief, amaravati farners pawan kalyan, amaravati farmers janasena, pawan kalyan, janasena, janasena, Amaravati farmers, capital region, land pulling, Andhra Pradesh, Politics

JanaSena president, powerstar Pawan Kalyan said that if needed, he would meet and discuss with PM Modi and Union Home Minister Amit Shah on the problems of Andhra. The power star also said that he never spoke against the location of Andhra Capital City in Amaravati.

రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: పవన్ కల్యాణ్

Posted: 08/30/2019 06:58 PM IST
Janasena chief pawan kalyan to meet modi and shah over amaravati

రాష్ట్రంలోని సమస్యలను దేశ ప్రధాని, బీజేపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తానని ఇక్కడి సమస్యలు, పరిస్థితులు వారికి వివరిస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి నుండి రాజధానిని తరలిస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇవాళ కురగల్లు గ్రామస్తులతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం కొండవీటి వాగు వద్ద వంతెన పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశంపై మంత్రులు బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. రాజధాని పనుల్లో అవినీతి జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజధానిని మార్చుతామంటూ లీకులు ఇవ్వడం సరికాదని చెప్పారు. మంత్రి బొత్స చెప్పినట్లుగా అమరావతిలో రాజధాని వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని పవన్ అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవద్దని మాత్రనే చెప్పానని గుర్తు చేశారు.

రాష్ట్ర రాజధాని ఒక కులానికి పరిమితం కాకుడదని, ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకూడదని చెబుతున్న రాష్ట్ర మంత్రులు కూడా తాము ఒక పార్టీకి చెందిన నేతలుగా వ్యవహరించ కూడదని... రాష్ట్ర ప్రజలందరికీ భవిష్యత్తు కోసం వారు పనిచేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయామని... ఇప్పుడు ఇలాంటి గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేకూరుతుందని అన్నారు. గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేయాలనుకుంటే... తాను కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు తమను కలవరానికి గురి చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసమే తాము భూములను ఇచ్చామని... ఏ ఒక్క పార్టీకో ఇవ్వలేదని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాజధాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచుతారా? లేదా? స్పష్టం చేయాలని అన్నారు. రాజధానిని పొలిటికల్ గేమ్ గా చూడొద్దని... రాజధానిని తరలించడానికి జనసేన ఒప్పుకోదని చెప్పారు. రాజధానిపై ప్రకటన చేసేముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని బొత్సకు సూచించారు. రాజధాని ప్రాంత రైతులకు తాను అండగా ఉంటానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Amaravati farmers  PM Modi  Amit Shah  Andhra Pradesh  Politics  

Other Articles