Teen dies a month after she was gangraped స్నేహితులే కాలయములై.. గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతి

Girl dies two months after being gang raped by four of her friends

Mumbai girl rape, Chunabhatti rape case, Mumbai chunabhatti Gang rape, NCP MP Supriya Sule, Maharashtra, crime

A 19-year-old girl who was gang-raped by four of her friends after she had celebrated her birthday party in a Mumbai suburb in July, has died at a government hospital, officials said

స్నేహితులే కాలయములై.. గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతి

Posted: 08/30/2019 07:40 PM IST
Girl dies two months after being gang raped by four of her friends

స్నేహితుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. సుమారు నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు శుక్రవారం వెల్లడించారు. తనతో నిత్యం వుండే స్నేహితులే కదా అని నమ్మి వెళ్తే ఆ మిత్రులే పైశాచిక మృగాలుగా మారి ఆ యువతి ప్రాణాలను తీస్తారు. ఈ ఘటన దేశ అర్థిక రాజధాని ముంబైలో జరిగింది. స్నేహితులతో కలసి తన జన్మదిన వేడుకలు జరుపుకుందామని వెళ్తే.. వారే అమె పాలిట యమకింకరులై ప్రాణాలను తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. జులై 7వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఓ స్నేహితుడి ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకుంది. దీనికి మరో ముగ్గురు స్నేహితులు కూడా హాజరయ్యారు. సాయంత్రం వేళ కేక్ కట్ చేసిన తర్వాత నలుగురు స్నేహితులు ఆమెను కోరిక తీర్చాలని వేధించారు. యువతి ప్రతిఘటించడంతో నలుగురూ ఆమెను బంధించి అత్యంత పాశవికంగా అమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జననాంగాల వద్ద తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు షాక్‌లోకి వెళ్లిపోయింది.

అర్ధరాత్రి సమయంలో తేరుకున్న యువతి ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు, పోలీసులకు చెప్పలేదు. అయితే రెండు వారాల తర్వాత జననాంగాల వద్ద తీవ్ర నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతిని ఆస్పత్రిని పరిశీలించిన డాక్టర్లు ఆమెపై అత్యాచారం జరిగిందని, ప్రైవేట్ పార్ట్స్‌ వద్ద తీవ్ర గాయాలున్నాయని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గ్యాంగ్ రేప్ ఘటనపై మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని చునభట్టి పోలీసులను ఆదేశించింది. ఈ కేసును అత్యాచారం, హత్యగా మార్చి నిందితులకు కఠినశిక్ష పడేలా చేయాలని సూచించింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు చునభట్టి పీఎస్ ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles