Actor Venkat thrashed by mob in Madikeri నటుడ్ని నడిరోడ్డుపై చితకబాదిన స్థానికులు.. ఎందుకంటే..

Actor venkat thrashed by mob for allegedly damaging car

Kollywood, Huccha venkat, Huccha venkat controversy, Sandalwood controversy, Sudeep, Bigg Boss Kannada 3 Sudeep, Ramya, Divya Spandana, sandalwood actor, mob, thrashes, KSRTC depot, Dileep, Karnataka, Crime

Actor Venkat was thrashed by an angry mob for allegedly damaging a car, the incident took place near Napoklu. However, the reason for creating nuisance is not clear. Police have taken Venkat into the custody and an inquiry is being conducted.

ITEMVIDEOS: నటుడ్ని నడిరోడ్డుపై చితకబాదిన స్థానికులు.. ఎందుకంటే..

Posted: 08/30/2019 05:55 PM IST
Actor venkat thrashed by mob for allegedly damaging car

చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమా చేసినా ఆ నటులకు కొంత ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఇక అందులో మూడు నాలుగు చిత్రాలు చేసినవారైతే.. ఇక వారికి స్టార్ స్టేటస్ వచ్చేసినట్టే. అయితే అవే నాలుగు చిత్రాలు ప్లాప్ అయితే.. ఇక వారి గురించి ఏందుకు అడుగుతారు. వారినెవరు గుర్తుపడతారనేగా మీ డౌట్. అయితే వారిని గుర్తుపట్టినా తప్పే. వారిని తదేకంగా చూసినా కోపమే. అదే కోపం కట్టలు తెంచుకుంది. అంతే ఒక వ్యక్తి చెంప చెల్లుమనిపించాడు ఆ నటుడు. అంతేకాదు అతని కారును ధ్వంసం చేశాడు కూడా. అప్పటికీ అతని కోపం చల్లారకపోవడంతో.. కారు డోరును కూడా తొలగించే ప్రయత్నం చేశాడు.

అంతే ఏదో జరుగుతుందని గుమ్మిగూడిన స్థానికులు వచ్చి సముదాయించారు.. వారించారు.. అయినా వినకపోవడంతో.. నటుడిని చావచితకకొట్టారు. ఇది కర్నాటకలో జరిగిన ఘటన. హుచ్చా వెంకట్ అంటే ఎంతో గుర్తింపు ఉన్న నటుడు, దర్శకుడు, నిర్మాత. 2005లో వచ్చిన 'మెంటల్ మాంజా' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. పలు చిత్రాల్లో నటించడమే కాదు, దర్శకత్వం కూడా వహించాడు. కొన్ని చిత్రాలకు నిర్మాత కూడా వ్యవహరించాడు. కన్నడ బిగ్ బాస్-3లోనూ పాల్గొన్నాడు. అయితే, కాంట్రవర్సీలకు ముద్దుబిడ్డగా మారిన ఈయనకు తాజాగా వినూత్న అనుభవం ఎదురైయ్యింది.

తన ప్రవర్తన ఎలాంటిదో సినిమాల్లో చూపించలేకపోయిన ఈ నటుడికి కన్నడ బిగ్ బాస్ షో ద్వారా మాత్రం చూపించే అవకాశం లభించింది. ఈ షోలోని తోటి కంటెస్టంట్లతో ఆయన వ్యవహరించిన తీరు గంధరగోళంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆతడ్ని ఈ షోలో అనుమతించినందుకు హోస్ట్ గా వ్యవహరించిన సుదీప్ టీవీ ఛానెల్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు, ఇక అంతకుముందు ఆయన ఏకంగా నటి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదగిన రమ్య అలియాస్ దివ్య స్పందనను పెళ్లి చేసుకున్నానని కూడా వ్యాఖ్యలు చేసాడు. దీనిపై అమె పెట్టిన కేసు విచారణ జరుగుతోంది.

ఇలా అనేక వివాదాలతో బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హుచ్చా వెంకట్ మరోసారి అదే రీతిలో హంగామా చేయడమే కాదు, ఈసారి స్థానికుల చేతిలో తన్నులు కూడా తిన్నాడు. కర్ణాటకలోని కొడగులో హుచ్చా వెంకట్ ఓ హోటల్ కు వెళ్లాడు. అయితే సినీ నటుడు కావడంతో దిలిప్ అనే వ్యక్తి అతడ్ని తదేకంగా చూశాడు. ఎంటీ అలా చూస్తున్నావ్.. నీ పని నువ్వు చేసుకో..  అంటూ వారించాడు. అయినా దిలిప్ అతడ్నే చూస్తుండిపోయాడు. దీంతో వెంకట్ ‘‘నేనెవరో తెలుసా’’ అంటూ ప్రశ్నించాడు. ఓ బాగా తెలుసు మీరు హుచ్ఛా  వెంకట్ కదా అని బదులిచ్చాడు.

సాధారణంగానే దిలిప్ ఇచ్చిన బదులుతో తనను ఏకవచనంతో సంబోధిస్తాడా అంటూ దిలిప్ చెంపను చెల్లుమనిపించాడు వెంకట్. అంతటితో ఆగకుండా అతనికి చెందిన కారును కూడా ధ్వంసం చేశారు. స్థానికులు గుమ్మిగూడి అలా చేయవద్దని వారించారు. అయినా వినకుండా ఇష్టంవచ్చినట్టు వ్యవహరించాడు. వింతగా ప్రవర్తించాడు. అంతే గుమ్మిగూడిన జనాలపైకి కూడా వెళ్లాడు. ఇంకేముందు జనాలకు కొపాన్ని చవిచూసి వారి చేతిలో దెబ్బలు తిన్నాడు. అయినప్పటికీ హుచ్చా వెంకట్ విచిత్రంగా ప్రవర్తిస్తూ మీడియా కెమెరాల కంట్లో పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సినీ నటుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Huccha Venkat  sandalwood actor  mob  thrashes  KSRTC depot  Dileep  Karnataka  Crime  

Other Articles