TDP leader charged with misbehaviour కూన రవికుమార్ అరెస్టుకు రంగం సిద్దం.. టీడీపీ నేత అజ్ఞాతం

Tdp leader kuna ravikumar absconding after charged with misbehaviour

koona ravikumar, kuna ravikumar, TDP leader absconding, Kuna Ravikumar absconding, dharmana prasad vs kuna ravi kumar, jagan fires on chandrababu, chandrababu fires on jagan, kuna ravikumar, TDP WHIP, TDP leader, absconding, dharmana prasad, YS Jagan, chandrababu, Andhra Pradesh, Politcis

former government whip and TDP leader Kuna Ravi Kumar is on the run after he was charged with misbehaviour and threatening Government officials from perfoming duties.

కూన రవికుమార్ అరెస్టుకు రంగం సిద్దం.. టీడీపీ నేత అజ్ఞాతం

Posted: 08/28/2019 11:53 AM IST
Tdp leader kuna ravikumar absconding after charged with misbehaviour

టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల విధుల నిర్వహణలో ఆటంకం కలిగించడంతో పాటు.. ప్రభుత్వ సిబ్బందితో అనుచితంగా మాట్లాడిన వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. విధి నిర్వహణలో టీడీపీ పార్టీకి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే ప్రయోజనం కలిగేలా అధికారులు వ్యవహరిస్తున్నారని.. ఆయన ఎంపీడివో సిబ్బందిపై మండిపడిన విషయం తెలిసిందే.

ఇందుకు సంబంధించిన అఢియో రికార్డింగ్ బయటకు రావడం.. నెట్టింట్లో అది వైరల్ కావడంతో.. ఎంపీడీవో కార్యలయ సిబ్బంది ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కూన రవికుమార్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం వరకు తన స్వగ్రామంలో ఉన్న రవి కుమార్ కేసు నమోదు అయినట్టు తెలియగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కూన రవికుమార్ ను అరెస్ట్ చేసేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పాడ్డారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూన రవికుమార్ అధికారులను హెచ్చరించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

టీడీపీ కార్యకర్తలు తెచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోకుండా నాటకాలు ఆడితే అధికారులను గదిలో వేసి చావగొడతా అని ఆయన వార్నింగ్ ఇచ్చారట. మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఉద్యోగులను అవమానించారని ఏపీ ఎన్‌జీఓ సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కూన రవికుమార్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం అవుతున్నాయని వారు చెబుతున్నారు. రవికుమార్‌పై చర్యలు తీసుకోకపోతే ఉద్యోగులమంతా మూకుమ్మడి సెలవుల్లోకి వెళతామని హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kuna ravikumar  TDP WHIP  TDP leader  absconding  dharmana prasad  YS Jagan  chandrababu  Andhra Pradesh  Politcis  

Other Articles