Sujana relatives has 124 acres in Capital: Botsa సుజనా..! ఈ అమరావతి ఆస్తులు ఎవరివీ.?: బొత్సా

Minister botsa satyanarayana reveals few assets details of sujana in amaravati

botsa reveals sujana asset details, sujana company holds 110 acres of land at amaravati, chandrababu relative allocated 500 acres land near to amaravati, sujana choudary, botsa satyanarayana, amaravati, inside trading, shifting of capital, Andhra Pradesh, Politics

Andhra pradesh Minister Minister Botsa satyanarayana reveals few assets details of Rajya sabha MP Sujana Chowdary in Amaravati, and also repeats the inside trading word on the name of state capital.

సుజనా అమరావతి ఆస్తుల చిట్టా.. రట్టు చేసిన బొత్సా

Posted: 08/27/2019 06:42 PM IST
Minister botsa satyanarayana reveals few assets details of sujana in amaravati

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిని విజయవాడ-గుంటూరు ప్రాంతం ప్రభుత్వం సమాలోచనలు జరుపుతుందని రాష్ట్ర మంత్రి బొత్సా సత్యనారాయణ రగిల్చిన నిప్పు రాజుకుంటూ మరింత వేగంగా రాజకీయ కలకలం కూడా రేపింది. రాజధాని ప్రాంతం ఎంపిక నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని బొత్సా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అటు రాష్ట్రమంత్రులు... ఇటు బీజేపీ ఎంపీలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

దీనికి బదులుగా మళ్లీ మీడియా ముందుకు వచ్చిన బొత్సా.. ఆధారాలతో పాటుగా సుజనా కుటుంబానికి చెందిన ఆస్తుల చిట్టాను బయటపెట్టాడు. అయితే అన్ని ఇలా మీడియా ఎదుల బయట పెట్టడం బావ్యం కాదన్న ఆయన మచ్చుకు కొన్ని ఆస్తుల వివరాలను మీడియా సాక్షిగా ప్రకటించి.. బీజేపి నేతకు షాక్ ఇచ్చారు. ఒక్క సెంటు భూమి ఉందని నిరూపించాలన్న ఆయన సవాల్ ను చేతల ద్వారానే స్వీకరించిన బొత్సా ఏకంగా 124 ఏకరాల భూమికి సంబంధించిన రాజధాని భూముల వివరాలను బయటపెట్టారు. అంతేకాదు గత అధికార పార్టీ చేసిన కారుచౌకగా కట్టబెట్టిన భూముల వివరాలను కూడా వెల్లడించారు.

సుజనా చౌదరి అన్న కుమారుడు జితిన్ కుమార్ కంపెనీ పేరు మీద చందర్లపాడు మండలంలో 110 ఎకరాలు ఉందని... ఆయన సోదరుడి కుమార్తెకు 14 ఎకరాలు ఉందని ఆయన వివరించారు. చంద్రబాబు వియ్యంకుడు వియ్యంకుడికి రాజధాని ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయించారని బొత్స ఆరోపించారు. రాజధాని పేరుతో జరిగిన అవినీతి, కుంభకోణాలను బయటపెడతామని అన్నారు. లోకేశ్ తోడల్లుడు తండ్రికి కూడా రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నాయని బొత్స వ్యాఖ్యానించారు. ఏపీఐఐసీ నుంచి 500 ఎకరాల భూమిని కారుచౌకగా అప్పగించి.. ఆ తరువాత దానిని రాజధాని ప్రాంతంలో కలిపారని.. ఈ విషయం నిజం కాదా.? అంటూ బొత్స నిలదీశారు.

రాజధాని విషయంలో అవినీతి జరిగిందనడానికి ఇంతకంటే ఏం ఆధారాలు కావాలని అన్నారు. రాజధాని అంటే కేవలం ఒక సామాజికవర్గానికి చెందినదిగా ఉండొద్దని... అన్ని ప్రాంతాల వారికి ఉండాలని బొత్స అన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగిందని ఆరోపించిన బీజేపీ... ఇప్పుడెందుకు మాట మార్చిందో అర్థం కావడం లేదని బొత్స అన్నారు. అమరావతిలో భూముల ధరలు తగ్గాయో లేవో తెలియదు కానీ... రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం భూముల ధరలు పెరిగాయని బొత్స అన్నారు. అమరావతిలో కొన్ని మినహా అన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే అని మంత్రి బొత్స తెలిపారు. చంద్రబాబులా తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోమని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles