Revanth Reddys Football Video A Hit With Fans నెట్టింట్లో వైరల్: రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయర్ అవతార్..

Congress mp revanth reddys football video goes viral on net

Revanth reddy plays football, Revanth Reddy, Malkajgiri MP plays football, Congress MP plays football, Revanth Reddy, Malkajgiri MP, Congress MP, Football, Video viral, rangareddy football team, telangana, Politics

Firebrand Congress MP Revanth Reddy played football today, not with his political opponents using his trademark feisty attacks but with real footballers on a real play ground this time.

ITEMVIDEOS: నెట్టింట్లో వైరల్: రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ప్లేయర్ అవతార్..

Posted: 08/28/2019 12:51 PM IST
Congress mp revanth reddys football video goes viral on net

ఆయన పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రప్రజలందరూ ఆయన్ను గుర్తు పడతారు. ఆయన్ను తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రజాగొంతుగా పిలుస్తారు. ఆయన మాట్లాడితే ప్రత్యేర్థిగుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఆయనే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఎప్పుడు ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి.. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే గొంతుకై నిలుస్తారు రేవంత్ రెడ్డి. కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించి.. తాజాగా మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎంపికైన రేవంత్.. కొత్త అవతారనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అదేంటి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతూ ఆయన కొత్త అవతారం ఏంటనేగా మీ డౌట్..? తాజాగా స్టేడియంలో ఫుడ్ బాల్ ఆడుతూ కనిపించారు. రాజకీయంగా మల్కాజ్ గిరి ఎంపీగా గోల్ కొట్టిన రేవంత్.. ఇటు మైదానంలో కూడా ఆటగాళ్ళతో చెడుగుడు ఆడేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అచ్చంగా ఫుల్ బాల్ క్రీడాకారుడిలానే ఆయన ఆడిన తీరు పలువురికి ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ తన మాటల తూటాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాదు.. ఆటగాడిగా కూడా మైదానంలో మెప్పించిన తీరును పలువురు అభినందిస్తున్నారు.

ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా క్రీడాకారుల బసలో వసతులను ఆయన పరిశీలించారు. అనంతరం కాసేపు మైదానంలో ఫుడ్ బాల్ ఆడుదాం డిసైడ్ అయ్యాడు వెంటనే.. మైదానంలోకి దిగి ఫుడ్ బాల్ ఆడారు. ఏదో అందరి ముందు బాల్ ను పట్టుకొని కాలుతో తన్నీ.. ఫోటోలకు పోజులు ఇచ్చే విధంగా ఆడకుండా.. ఏకంగా డ్రెస్ మార్చేసాడు.. రంగంలో దిగాడు. తన ట్వీట్టర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డే పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో గోల్స్ చేస్తు.. ఆటు ఇటు పరుగెట్టడం చూస్తాం. మొత్తానికి ఈ వీడియో చూసిన అభిమానులు రాజకీయం రంగంలోనే కాదు క్రీడారంగంలోనూ నువ్వు కింగ్ వే అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles