MP sujana challenges botsa on amaravati lands మంత్రి బొత్సాకు సవాల్ విసిరిన సుజనా

Shifting amaravati capital is not easy says bjp mp sujana chowdary

sujana challenges botsa on amaravati land, sujana on amaravati land, sujana on amaravati shifting, sujana on botsa satyanarayana, sujana choudary, botsa satyanarayana, kanna laxminarayana, amaravati, inside trading, Andhra Pradesh, Politics

BJP MP sujana chowdary challenges minister botsa satyanarayana on having a single cent of land on his name in amaravati and also says changing of capital is not so eady as it is with necessary permission from national green tribunal

బొత్సా సత్యానారాయణకు సవాల్ విసిరిన సుజనా చౌదరి

Posted: 08/27/2019 05:59 PM IST
Shifting amaravati capital is not easy says bjp mp sujana chowdary

కొత్త ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులైన సందర్భంగా తమను డోలాయమానంలో పడేసిందని రైతులు కలవరపడ్డారు. ఈ క్రమంలో బీజేపి మరో అడుగు ముందుకేసీ రాజధాని ప్రాంతంలో పర్యటించింది. కొందరు రాజధాని మారిపోతుందంటే.. మరికొందరు ఏపీకి నాలుగు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతంలోని తూళ్లూరులో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పర్యటించిన బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పటికే వేడెక్కిన అంశాన్ని మరింత హీట్ పెంచాయి.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని మార్చడం చెప్పినంత సులువు కాదని అన్నారు. కొందరు రాష్ట్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బొత్సను ఉద్దేశిస్తూ ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి గురించి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజధానికి కూడా కులం అపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారం అమరావతికి చేటుచేస్తుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు.

అమరావతిలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరిగాయని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన అనుమతితోనే అమరావతి నిర్మాణం జరిగిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజధానిపై నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మంత్రి బొత్సపై సుజనా చౌదరి మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో తనకు ఒక సెంటు స్థలం ఉందేమో నిరూపించాలని సవాల్ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles