Cyberabad Police searches on for Ravi Prakash in TV9 case రవిప్రకాష్ కోసం సైబరాబాద్ పోలీసులు అన్వేషణ.!

Cyberabad police searches on for ravi prakash in tv9 case

Ravi Prakash, Shivaji, MKVN Murthy, Hari, MSN Murthy, vijayawada Advocate, data theft, fake shares purchase, national company law tribunal, Forgery Case, Cyberabad Cybercrime Police, Investigation, Evidences, Hyderabad, KCR, Telangana CM, Telangana, politics

The Cyberabad police are in search of TV9 former CEO V Ravi Prakash and Actor sivaji who is absconding since the fraud, forgery, cheating, criminal breach of trust and causing wrongful loss to company cases filed against him by ABCL Managment.

రవిప్రకాష్ కోసం సైబరాబాద్ పోలీసులు అన్వేషణ.!

Posted: 05/31/2019 01:36 PM IST
Cyberabad police searches on for ravi prakash in tv9 case

పోర్జరీ, డాటా చోరి, అధికార దుర్వినియోగంతో టీవీ9 లోగా సహా కాపిరైట్స్, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ లను కారుచౌకగా మరో కంపెనీకి కట్టబెట్టాడన్న అభియోగాలను ఎదుర్కోంటూ తప్పించుకుని తిరుగుతున్న సీనియర్ పాత్రికేయుడు, టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఎక్కడున్నాడని పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఓ వైపు ముందుస్తు బెయిల్ కోసం తన తరపును లాయర్లను ఇటు రాష్ట్ర హైకోర్టకు.. ఆక్కడి విఫలం కావడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా పంపుతున్న ఆయన.. ఇంతకీ ఎక్కడున్నాడు. ఎఉలా న్యాయవాదులను సంప్రదిస్తున్నాడు అన్న కోణంలో సైబరాబాద్ పోలీసలు ఆయన కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

టీవీ9 కు చెందిన ఏబిసీఎల్ సంస్థలో వాటాల వివాదంలో ఆయనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి విచారణకు హాజరు కావాల్సిందిగా పలుమార్లు నోటీసులు అందించిన పోలీసులు, ఆయన హాజరు కాకపోవడంతో అరెస్టు చేసే దిశగా వేట మొదలు పెట్టారు. ముఖ్యంగా ఫోర్జరీ కేసులో తొలుత 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. వాటికి స్పందించక పోవడంతో 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయనా స్పందించ లేదు. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి మేరకు పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఓ వీడియో సందేశాన్ని మాత్రం రవిప్రకాశ్ విడుదల చేశారు.

ఈ క్రమంలో రవిప్రకాశ్ ఏపీలోని ఓ రిసార్ట్స్‌లో తలదాచుకుంటున్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడ గాలించినా ప్రయోజనం లేకపోయింది. అక్కడి నుంచి బెంగళూరు, తర్వాత గుజరాత్‌, ఆ తర్వాత మళ్లీ బెంగళూరు వెళ్లినట్లు సమాచారం ఉండడంతో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌ న్యాయమూర్తి కొట్టేయడంతో రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పు రావాల్సి ఉంది. కాగా, ఇదే కేసులో సహనిందితుడైన సినీ హీరో శివాజీ కోసం కూడా సైబర్‌ క్రైం పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles