మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి మోడలింగ్ రంగంలో అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది మీరా మిధున్. ఆ వెంటనే చిత్రరంగంలో ప్రవేశించినా.. అనుకున్నంత అవకాశాలు దక్కడ తన జీవితంలో ఎదగాలంటే జోడు గుర్రాలపై స్వారీ చేయాలని భావించింది. దీంతో అటు మోడలింగ్ ఇటు సినీ కెరీర్ లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అమె.. అకస్మాత్తుగా పోలీసులను ఆశ్రయించారు. తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. తనను హత్య చేస్తామని దుండగలు ఫోన్ లో బెదిరిస్తున్నారని మీరా మిథున్ పోలీసులకు తెలిపారు.
చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ మేరకు ఫిర్యాదు చేసిన అమె.. తానే సొంతంగా అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో, 'మిస్ తమిళ్ దివా' పేరిట పోటీలను ప్రకటించానని, అప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆమె తెలిపింది. '8 తోట్టాగళ్', 'తానా సేర్నద కూట్టం' తదితర తమిళ చిత్రాల్లో నటించిన కథానాయిక.. మిస్ సౌత్ ఇండియన్ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే తాను నిర్వహించ తలపెట్టిన అందాల పోటీలకు పోలీసుల భద్రత కల్పించాలని అమె మరో దరఖాస్తు కూడా కమీషనర్ కు అందజేసినట్లు సమాచారం.
ఈ పోటీలను తాను రానున్న సొమవారం నిర్వహించాలని భావించానని, ఈక్రమంలో తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయయని అమె తెలిపారు. అయితే తాను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని.. ఈ తరుణంలో పోటీలో పాల్గొనే యువతులకు బెదిరింపులు వెళ్లాయని, దీంతో వారు భయాందోళనకు గురయ్యారని.. అందుకనే తాను పోలీసులను అశ్రయించినట్లు అమె తెలిపారు. గత వారం రోజులుగా బెదిరింపు ఫాన్ కాల్స్ తీవ్రత పెరిగిందని, చంపేస్తామంటున్నారని ఆమె వాపోయింది.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more