గతంలో తాము సాధించిన మెజారిటీ కన్నా అధిక మెజారిటీతో కేంద్రంలో నూతనాధ్యయం రచించి మరీ అధికారాన్ని చేజిక్కించుకన్న బీజేపి పార్టీ.. తమ మిత్రపక్షాలతో కలసి మరోమారు కేంద్రంలో ఎన్డీయే పాలనను అందించేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే రెండో పర్యాయంలో ఎవరిరెవరికి మంత్రిపగ్గాలు దక్కుతాయన్న ఉత్కంటకు తెరపడింది. ఈ క్రమంలో బీజేపి సీనియర్ నేతలైన సుష్మా స్వరాజ్.. మేనకా గాంధీలతో పాటు క్రీడాకారుడిగా తన సత్తాను చాటి గత ప్రభుత్వంలో మంత్రి గా కోనసాగిన రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లకు పదవులు దక్కలేదు.
కేంద్ర మంత్రి పదవుల నుంచి ఈ ముగ్గురినీ తప్పించిన ప్రధాని.. పలువురు కొత్త ఎంపీలకు తమ క్యాబినెట్ లో స్థానం కల్పించారు. అయితే సీనియర్ మంత్రి అరుణ్ జైట్లీ తరహాలోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నారన్న కారణంగానే సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ ను పదవికి దూరం పెట్టారన్న వార్తలు వినిబడుతున్నాయి. కాగా, సీనియర్ మంత్రులలో దాదాపుగా అందరూ క్యాబినెట్ లో తమ స్థానాలను భర్తీ చేసుకన్నారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ అప్పగించారు.
ఇక నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ సహా పలువురు సీనియర్లను యధాతథంగా తమ క్యాబినెట్ బర్తలను కేటాయించారు ప్రధాని. కిత్రం రోజు రాత్రి 57 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈ దఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది. ప్రజావినతులు, ఫించన్ల శాఖ, ఆటామిక్ ఎనర్జీ, స్పేస్ విభాగాలు, మంత్రులెవరికీ కేటాయించని ఇతర శాఖలను ప్రధాని మోదీ తన వద్దే ఉంచుకున్నారు.
కేంద్రమంత్రి పదవుల శాఖలు
రాజ్ నాథ్ సింగ్ రక్షణ శాఖ
అమిత్ షా హోం శాఖ
నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు
DV సదానంద గౌడ రసాయన, ఎరువుల శాఖ
నిర్మల సీతారామన్ ఆర్థికశాఖ
రామ్ విలాస్ పాశ్వాన్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు
నరేంద్ర సింగ్ తోమార్ వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్
రవిశంకర్ ప్రసాద్ న్యాయ, సమాచార, ఐటీ శాఖ
హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆహార శుద్ధి పరిశ్రమ
తవార్ చంద్ గెహ్లాట్ సామాజిక న్యాయం, సాధికారత
సుబ్రమణ్యం జైశంకర్ విదేశాంగ శాఖ
రమేష్ పోఖ్రియాల్ మానవ వనరుల అభివృద్ధిశాఖ
అర్జున్ ముండా గిరిజన సంక్షేమం
స్మృతి ఇరానీ స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ
డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ప్రకాష్ జవ్దేకర్ పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ
పియుష్ గోయల్ రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ
ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనార్టీ సంక్షేమశాఖ
ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనులశాఖ
మహేంద్రనాథ్ పాండే నైపుణ్యాభివృద్ధి శాఖ
అరవింద్ సావంత్ భారీ పరిశ్రమలు
గిరిరాజ్ సింగ్ పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్
గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తి
స్వతంత్ర హోదా కల్గిన కేంద్ర మంత్రుల శాఖలు
కిరెన్ రిజిజు క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు
సంతోష్ గంగ్వార్ శ్రామిక, ఉపాధి కల్పన శాఖ
శ్రీపాద యశో నాయక్ ఆయుష్, రక్షణశాఖ
జితేంద్ర సింగ్ ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి
రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రణాళిక, గణాంక శాఖ
ఆర్కె సింగ్ విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
హర్దీప్ సింగ్ పూరి గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
మనుషు మండవియ షిప్పింగ్, రసాయనాలు, ఎరువులు
ప్రహలాద్ సింగ్ పటేల్ సాంస్కృతిక పర్యాటక శాఖ
కేంద్ర సహాయ మంత్రుల శాఖలు
అర్జున్‌రామ్ మేఘవాల్ పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
అశ్విని కుమార్ చౌబే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
ఫగన్‌సింగ్ కులస్థే ఉక్కు శాఖ
రావు సాహేబ్ ధాన్వే వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ
క్రిషన్ పల్ గుర్జార్ సామాజిక న్యాయం, సాధికారత
వీకే సింగ్ రహదారులు, రవాణాశాఖ
గంగపురం కిషన్ రెడ్డి హోంశాఖ
పురుషొత్తం రుపాలా వ్యవసాయం, రైతు సంక్షేమం
రామ్దాస్ అత్వాలే సాంఘిక న్యాయం, సాధికారత
సద్వి నిరంజన్ జ్యోతి గ్రామీణాభివృద్ధి
బాబుల్ సుప్రియో అటవీ పర్యావరణ శాఖ
సంజీవ్ బాలన్ పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్
సంజయ్ శాంరావ్ ధోత్రే మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీశాఖ
అనురాగ్ ఠాకూర్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
సురేష్ చిన బసప్ప రైల్వే శాఖ
నిత్యానంద్ రాయ్ హోంశాఖ
రతన్ లాల్ కఠారియా నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత
వి మురళీధరన్ పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు
రేణుక సింగ్ గిరిజన వ్యవహరాలు
సోమ్ ప్రకాష్ పరిశ్రమలు, వాణిజ్యం
రామేశ్వర టెలీ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
ప్రతాప్ చంద్ర సారంగి మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ
బార్మర్ కైలాష్ చౌదరి వ్యవసాయం, రైతు, సంక్షేమ శాఖ
దేబశ్రీ చౌదరి మహిళా శిశు సంక్షేమ శాఖ
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more