Naveen Patnaik sworn in as CM of Odisha ఐదవసారి ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్..

Naveen patnaik takes oath as odisha cm for 5th term

Naveen Patnaik sworn in as CM of Odisha, Naveen Patnaik Odisha CM for 5th term, Narendra Modi, Naveen Patnaik, Odisha, Chief Minister, Bhubaneshwar, Assembly elections, lok-sabha-elections-2019, Odisha Politics

Naveen Patnaik’s emphatic win is the sweetest and the most significant as the gentleman politician was fighting for his fifth consecutive term in the coastal state and has been at the helm of affairs for an unprecedented 19 long years already.

ఐదవసారి ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్..

Posted: 05/29/2019 02:31 PM IST
Naveen patnaik takes oath as odisha cm for 5th term

బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మరోమారు ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ గణేషి లాల్.. నవీన్ పట్నాయక్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఒడిశాకు వరుసగా ఐదవసారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణం చేయటం విశేషం. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పట్నాయక్‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలుగా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

పట్నాయక్ కేబినెట్ లో ఈ సారి 10 మంది కొత్తవారికి అవకాశం కల్పించటం మరో విశేషం. లోక్ సభ ఎన్నికలతో పాటు ఒడిషా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో 113 చోట్ల బీజేడీ అభ్యర్థులు గెలిచి విజయం సాధించారు. ఒకసారి గెలవడమే గొప్ప విషయంగా మారిన ఈ సమయంలో వరుసగా ఐదుసార్లు విజయం సాధించడమంటే అంత ఆషామాషీ కాదు. కానీ నవీన్ పట్నాయక్‌ను మాత్రం ఒడిశా ప్రజలు వరుసగా ఐదోసారి సీఎం‌ను చేశారు. అందుకు ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన పలు మహిళా. గ్రామీణ రైతు, యువత సంక్షేమ పథకాలు ఆయనకు మళ్లి, మళ్లీ సీఎం ఫీఠం అందుకునేలా చేస్తున్నాయి.

నవీన్ పట్నాయక్‌ పట్ల గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అమితమైన ఆదరణ ఉంది. అందుకే 2000, మార్చి 5 నుంచి ఇప్పటికీ ఆయనే సీఎం, మరో ఐదేళ్లు కూడా పట్నాయక్‌దే ముఖ్యమంత్రి పీఠం. నవీన్ పట్నాయక్ తండ్రి దివంగత బిజయానంద పట్నాయక్ రెండు పర్యాయాలు ఒడిశా సీఎంగా పనిచేశారు. ఆయన మరణం తర్వాత 1997లో బిజూ జనతాదళ్ పేరిట కొత్త రాజకీయ పార్టీని నవీన్ స్థాపించారు. తండ్రి ప్రాతినిథ్యం వహించిన అస్కా పార్లమెంటు స్థానం ఉపఎన్నికలో విజయం సాధించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే నవీన్ ఒడిశా బయటే పెరగడంతో మాతృభాష ఒడియా మాట్లాడటం రాదు. ఎన్నికల ప్రచార సభల్లో పట్నాయక్ తన ప్రసంగాలను ఇంగ్లిష్‌లో రాసుకొని మాట్లాడతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles