Newly-elected BJP MP known as 'Odisha's Modi' నూటికో కోటికో ఒక్కరు.. మా ఎంపీ నీవే సారు..

Balasore mp pratap chandra sarangi s strength lies in his simplicity

Bhubaneswar, Rashtriya Swayamsevak Sangh, Ram Madhav, lok sabha, Biju Janata Dal, bajrang dal, Pratap Chandra Sarangi, Nana, MP simple lifestyle, Balasore MP, Odisha, Politics

Two-time MLA Pratap Chandra Sarangi has lived a life of austerity. Lovingly called Nana (elder brother) in the district, the 64-year-old's simple lifestyle and dedication to the people are what endeared him to most.

నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో వుడతారు.. మా ఎంపీ నీవే సారు..

Posted: 05/29/2019 01:49 PM IST
Balasore mp pratap chandra sarangi s strength lies in his simplicity

నూటికో కోటికో ఒక్కరు.. ఎప్పుడో ఎక్కడో పుడతారు.. అది మీరే మీరే మాస్టారు.. మా దేవుడు మీరే మాస్టారు అంటూ ఆంధ్రుల అన్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు నటించిన విశ్వరూపం చిత్రంలోని పాట.. ఇప్పటి రాజకీయాల్లో అసలు నిజం కాదనుకుంటే మాత్రం పొరబాటే. ఎందుకంటే ఆ మధ్య రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో బీఎస్పీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే.. ఎలా అయితే మార్పు కోసం నాంది పలుకుతూ కొత్తదనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తరువాత తాజాగా ఇప్పుడు ఏకంగా ఓ అధికార పార్టీ ఎంపీ.. నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాడు. మన పోరుగు రాష్ట్రమైన ఒడిశాలోని బాలాసోర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను నెటిజనులు ‘ఒడిశా మోడీ’ అని పిలుస్తుంటారు. అసలు ఆయన ఎవరు..? ఆయనకు సంబంధించిన విశేషాలేమిటీ..?

రాజకీయ నేతలంటే అనుచరులు, హాడావిడి, మందీ మార్బలం..... తన వెంట అధికారికాంగానే నాలుగైదు కార్లు. మన నగరంలో సర్వసాధారణమైన కార్పోరేటర్ స్థాయి వ్యక్తులకే ఈ బిల్డప్ లేనిది జీర్ణంచుకోలేరు. ఇక శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు అయితేనో వారిని కలవడానికే పెద్ద స్పీడ్ బ్రేకర్లు వుంటాయి. పోలీసుల సెక్యూరిటీ, ఇంద్రభవనం లాంటి బంగ్లా, ఖరీదైన కార్లు, నౌకర్లు ఆ లైఫే వేరు. ఇంటి ముందరే సెక్యూరిటీ.. అది దాటితే ఆయన అనుచరగణం.. వాళ్లనూ దాటితే గన్ మెన్లు.. ఇక వీళ్లను కూడా దాటితే.. ఇప్పుడోచ్చేది ఆయన పర్సనల్ అసిస్టెంట్. వీళ్లందర్నీ దాటుకుని లోపలికెళ్లినా.. వాళ్ల దర్శనబాగ్యం కలుగుతుందని చెప్పలేం.

కానీ ఈ పార్లమెంటు సభ్యుడు మాత్రం ఇప్పుడున్న ఎంపీలకు చాలా భిన్నం. భిన్నం అంటే.. పూర్తిగా విభిన్నం. హంగామా అమడదూరం.. నియోజకవర్గంమంతా తన అనుచరగణమే.. వారే తనకు భద్రతా సిబ్బంది.. వ్యక్తిగత సహయకుడు లేకుండా.. కనీసం తనకు ఇళ్లు కూడా లేకుండా.. తన నియోజకవర్గంలో తిరిగేందుకు ఆయనకున్న ఒకే ఒక్క ద్విచక్రవాహనం సైకిల్. ఆయన పనులు చేసేందుకు కనీసం పరిచారకులు కూడా లేరు. ఆయనే స్వయంగా తన పనులన్నీ చక్కబెట్టుకుంటారు. అత్యంత సామాన్యుడిగా సాదాసీదా జీవినం కలిగివుటారు. పూరి గుడిసెలో జీవిస్తారు. అయితే అందులోనూ ఎలాంటి ఏసీలు, సుతిమెత్తని సోమాలు, మంచాలు లేవు.

దేశంలో సగటు పేదవాడి జీవిన విధానాన్ని తాను కూడా అదేపంథాలో జీవిస్తుంటాడు ఈ పార్లమెంటు సభ్యుడు. తనకు వచ్చిన జీతాన్ని పేదల కోసమే ఖర్చు పెడుతుంటారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. అనుకుంటున్నారా...? ఆయనే బీజేపీ నాయకుడు, ఒడిషాలోని బాలసోర్ ఎంపీ  ప్రతాప్ చంద్ర సారంగి(64). ఈయన్ని అందరూ ఒడిషా మోడీ అని పిలుస్తుంటారు. ఒడిషాలోని నీలగిరి నియోజక వర్గం నుంచి 2004, 2009 ల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సేవలందించారు. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి సారంగి ఓడి పోయారు.

2019 లో జరిగిన ఎన్నికల్లో  బీజేడీ అభ్యర్ధి  రవీంద్ర కుమార్ పై 12,956 ఓట్ల మెజార్టీతో గెలుపొంది పార్లమెంట్ లోకి అడుగిడబోతున్నాడు.  సారంగి  పెళ్లిచేసుకోలేదు. అవివాహితుడు .సొంత కుంటుబం లేదు, ఈయన తల్లి గతేడాది మరణించింది. ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కుర్తా పైజమా ధరించి, భుజానికో సంచి తగిలించుకుని, గుబురు గడ్డంతో సైకిల్ పై నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తుంటారు. పూరి గుడిసెలో నివసిస్తూ ప్రజలతో మమేకమై  ప్రజల కష్టాలను పరిష్కరించే సారంగి అంటే ప్రజలు అభిమానం చూపిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిషా వచ్చిన ప్రతిసారి సారంగిని కలిసి వెళ్ళేవారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pratap Chandra Sarangi  Nana  MP simple lifestyle  Balasore MP  Odisha  Politics  

Other Articles