Cop rescues two villagers stuck in well సృజన్ రెడ్డికి హరీశ్ రావు సెల్యూట్.. మీరు శాఖకే గౌరవం..

Cop saves two workers from asphyxiation harish rao salutes

jammikunta circle inspector, k srujan reddy, karimnagar police commissioner, madipalli, vb kamalasan reddy, jammikunta, karimnagar, telangana, crime

A police officer’s daredevilry in saving lives of two workers, who got into an unused open well, came in for strong praise from his superiors as well as public in Madipalli village of Karimnagar district

సృజన్ రెడ్డికి హరీశ్ రావు సెల్యూట్.. మీరు శాఖకే గౌరవం..

Posted: 05/29/2019 03:48 PM IST
Cop saves two workers from asphyxiation harish rao salutes

పోలీస్ అన్న పదములో వున్న పవర్ ఫుల్ వైబ్రేషన్.. నేరస్థులు, సంఘవిద్రోహశక్తుల పాలిట సింహస్వప్నమని ఇప్పటికే అనేక మంది అధికారులు రుజువుచేశారు. అయితే పోలీస్ అంటే.. అది మాత్రమే కాదు.. ప్రజలకు నిజంగా అవసరమైన సమయంలో ఆదుకునే ఆపన్న హస్తం కూడా అని నిరూపించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డి. ఆయన తన ప్రాణాలను పనంగా పెట్టి ఇద్దరు సామాన్యుల ప్రాణాలను కాపాడటానికి చేసిన ధైర్యసాహసాలతో తన ఉన్నతాధికారులు, మాజీ మంత్రుల చేత కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు.. ఇప్పుడా అధికారి నెట్టింట్లో కూడా సంచలనంగా మారారు.

జిల్లాలోని మడిపల్లి గ్రామంలో బావిలో పూడిక తీసేందుకు దిగిన ఇద్దరు వ్యక్తులు ఊపిరి ఆందకపోవడంతో స్పృహ కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు గ్రామ అధికారులు అక్కడకు చేరకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు అక్కడే ఉన్నప్పటికీ బావిలోకి దిగే సాహసాన్ని ఎవరూ చేయలేకపోయారు. అయితే వారిని బయటకు తీయాల్సిన బాధ్యతను ఎవరూ తీసుకోలేకపోతున్నారు. ఇద్దరు పోలీసులు ప్రయత్నం చేసినా.. మద్యలోకి వెళ్లాక ఊపిరి అందక బయటకు వచ్చేశారు.

అయితే జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి వెంటనే రంగంలోకి దూకేశారు. బావిలోకి తాడుతో దిగి ఇద్దరిని పైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తాడు తెగిపోవడంతో సృహ కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ బావిలోకి జారిపడ్డారు. ఈ ఘటనలో సిఐ సృజన్ కు గాయాలు అయ్యాయి. అయినా ఏ మాత్రం అధైర్యం చెందని సిఐ.. తన ప్రాణాలను పనంగా పెట్టి మరీ బావిలోకి మరోమారు దిగి బాధితులకు గట్టిగా తాడు కట్టి బయటకు తీసుకురావడంతో దోహదపడ్డాడు. ఇలా ఇద్దరినీ బయటకు పంపిన తరువాత చివరికి ఆయన కూడా సురక్షితంగా పైకి వచ్చారు.

తాజాగా ఈ విషయమై మీడియాలో వచ్చిన కథనాలపై సిఐ సృజన్ రెడ్డిని ఉన్నతాధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. వీరితో పాటు టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ‘ప్రజలకోసం ప్రాణాలకు తెగించడం అంటే ఇదే. ఇటువంటి ధైర్యసాహసాలు మొత్తం పోలీసు శాఖకే గౌరవం తీసుకువస్తాయి. జమ్మికుంట సిఐ సృజన్ రెడ్డిగారు .. మిమ్మల్ని చూసి పోలీసు శాఖే కాదు, మొత్తం తెలంగాణ సమాజం గర్విస్తోంది. మీ  సాహసం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలి. మీకు నా శాల్యూట్’ అని ట్వీట్ చేశారు. ఇక నెట్టింట్లో సృజన్ రెడ్డి సాహసంపై నెటిజనులు కొనియాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammikunta  k srujan reddy  karimnagar  madipalli  vb kamalasan reddy  jammikunta  telangana  crime  

Other Articles