IED blast injures 21 security personnel in Jharkhand జార్ఖండ్ లో ఐఈడీ పేల్చిన మావోలు.. 15 మంది జవాన్లకు గాయాలు

Jharkhand naxals trigger ied blast in saraikela 15 security personnel injured

jharkhand, jharkhand blast, Kuchai area, kuchai blast, Saraikella blast, Saraikella, cobra forces, cobra, jharkhand police, Crime

An improvised explosive device (IED) blast triggered by Naxals targeted security forces in Jharkhand's Saraikela area on Tuesday. Fifteen personnel have been injured in the IED attack.

జార్ఖండ్ లో ఐఈడీ పేల్చిన మావోలు.. 15 మంది జవాన్లకు గాయాలు

Posted: 05/28/2019 11:42 AM IST
Jharkhand naxals trigger ied blast in saraikela 15 security personnel injured

జార్ఖండ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. రాష్ట్రంలోని కుబాయ్ ప్రాంతంలోగల సరాయ్ కెల్లా సమీపంలో వెళుతున్న భద్రతా సిబ్బంది కాన్వాయ్ లక్ష్యంగా చేసుకుని శక్తిమంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో 8 మంది కోబ్రా జవన్లు, ముగ్గరు జార్ఖండ్ పోలీసులు గాయలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఈ తెల్లవారుజామున ఘటన జరుగగా, తమ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న జవాన్లు టార్గెట్ గా చేసి మవోయిస్టులు బాంబులు పేల్చారు.

ఇవాళ తెల్లవారు జామున 4.30 నిమిషాలకు ఖార్సవాన్ జిల్లా సరాయికెల్లా గ్రామ పరిధిలోని కుచాయి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తూన్న పోలీసులను టార్గెట్ గా చేసుకుని మావోలు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.  ఈ దాడిలో 209 బెటాలియన్‌కు చెందిన ఎనిమిది మంది కోబ్రా జవాన్లు, ముగ్గురు జార్ఖండ్ పోలీసులు చనిపోయారు. బాంబు పేలుడు దాటికి గాయపడినవారిని హెలికాప్టర్లో రాంచీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. మావోయిస్టుల కోసం గాలిస్తుండగా ఈ పేలుడు జరిగింది.

బాంబు విస్పోటనం జరిగిన సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరకుని.. ఎయిర్ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను స్థానిక అసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా 11 మంది జవానల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా వుందని అధికారులు తెలిపారు. ఇక ఘటనాస్థలానికి అదనపు బలగాలను పంపించారు ఉన్నతాధికారులు.. మావోయిస్టుల కోసం విసృతంగా గాలిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావటంతో.. ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. ఇటీవల కాలంలో మావోలు - జవాన్ల మధ్య తరచూ కాల్పులు కూడా జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles