HIgh Temperatures record in Telangana రోహిణీ కార్తే దెబ్బకు పిట్టాల రాలిన ప్రాణాలు

Record level high temperatures in the country rajasthan 52 4

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, heatwave in Hyderabad, Rajasthan, Ramagundam, telangana, Andhra Pradesh

Rajasthan experiencing the country's high Temperature this summer. Along with Telanganites who too are experiencing more than comman temperature this summer, along with the Heat wave.

రోహిణీ కార్తే: వడదెబ్బకు పిట్టాల రాలుతున ప్రాణాలు

Posted: 05/28/2019 11:19 AM IST
Record level high temperatures in the country rajasthan 52 4

ప్రచండ భానుడి ఉగ్రరూప సరిగ్గా రోహిణి కార్తె సంక్రమించే రోజుల్లో అత్యంత అధికంగా వుంటుందని పెద్దలు చెప్పిన మాటలు ఈ సారి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ లో పరిస్థితి మరింత  దారుణంగా ఉంది. అసలే మండతున్న ఎండలతో రాజస్థాన్ ఇసుకదిబ్బలు అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. జైసల్మేర్‌ సరిహద్దు ఔట్ పోస్టు సమీపంలో ఏకంగా 52.4 డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. జైసల్మేర్‌ తరువాత దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోని రామగుండుంలో రెండో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయ్యాయి.

మే 27వ తేదీ రికార్డ్ స్థాయిలో టెంపరేచర్ నమోదు అయ్యింది. 47.4 డిగ్రీల ఎండతో.. ప్రజలు అల్లాడిపోయారు. రామగుండం అగ్నిగుండంలా మండిపోయింది. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాడ్పులు వీస్తుండటంతో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాద్‌లలోనూ ఎండలు సెగలు పుట్టించాయి.  ద్రోణుల ప్రభావం, ఎండ తీవ్రతకు చెదురుమదురుగా వర్షాలు కురిసినా ఉష్ణోగ్రతల తాకిడికి క్షణాల్లోనే ఆవిరైపోతున్న పరిస్థితి. సాధారణంగా వడగాడ్పులు వీస్తున్న ఈ క్రమంలో ఎండ తీవ్రత కూడా నాలుగైదు రోజులు కొనసాగి ఆ తర్వాత కొద్దిగా తగ్గుముఖం పడుతాయి.

కానీ..2019లో మార్చి నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరగటమే తప్ప తగ్గడం లేదు. గాలిలో తేమ శాతం కనిష్ఠానికి పడిపోవడం, సూర్యప్రతాపం తీవ్రత పెరగటంతో ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని నిపుణులు అంటున్నారు. గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంటేనే వేసవిలో వర్షాలు కురిసే అవకాశముంటుంది. కానీ ఈవేసివిలో అటువంటి వాతావరణం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాగా రానున్న రెండుమూడు రోజుల్లో వాయవ్య, మధ్యభారతంలో పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రచండ భానుడి దెబ్బకు రోజువారీ పనిచేసుకునేవారైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సోమవారం రోజే ఎండ దెబ్బకు రాష్ట్రంలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బకు గురై సూర్యాపేట జిల్లాలో ముగ్గురు, యాదాద్రి భువనగిరి జిల్లాలో నలుగురు, నల్లగొండ జిల్లాలో ముగ్గురు, కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురు, సిరిసిల్ల, కుమరంభీం జిల్లాల్లో ఒకరు, పెద్దపల్లి జిల్లాలో ఐదుగురు, భద్రాద్రి జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో ముగ్గురు, జనగామ జిల్లాలో ముగ్గురు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు, ములుగు జిల్లాలో ఇద్దరు, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చనిపోయారు. శరీరం చెమటపట్టకపోవడం లేదా పొడిబారడం, ఎర్రగా కందిపోవడం, తలనొప్పి, దురదలు, వాంతులు లక్షణాలను బట్టి వడదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎండల సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles