TDP defeat impacts on TTD board meeting పదవిపై బెట్టు వీడని పుట్టా.. టీటీడీ సమావేశం రసాభస

Ysrc objects to naidu s ttd board members move to hold meet

Tirumala Tirupati Devasthanam Boar, TTD Board, TTD board meeting, putta sudhakar, Tella Babu, Anil kumar singhal, srinivas raju, ruckus in TTD board meeting, Tella Babu Resignation, AP Election Results, Tirupati, andhra pradesh, politics

The TDP's crushing defeat in the election had it's impact on TTD trust board which met in Tirumala. The meet chaired by trust board chairman Putta Sudhakar Yadav commenced at 10 am but ended abruptly without taking any decision after 45 minutes.

పదవిపై బెట్టు వీడని పుట్టా.. టీటీడీ సమావేశం రసాభస

Posted: 05/28/2019 12:35 PM IST
Ysrc objects to naidu s ttd board members move to hold meet

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే నామినేడేట్ పోస్టుల్లో వున్న పార్టీ నేతలు ఆయా పదవులకు రాజీనామాలు సమర్పించడం పరిపాటిగా వస్తున్న క్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ పదవిపై మాత్రం టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ బెట్టు వీడటం లేదు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవిలో కొనసాగుతున్న ఆయన రాజీనామా విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారు. అంతేకాదు తన రాజీనామా కోరే హక్కు ఎవరికీ లేదని, ఈ విషయంలో ఆయన ఏకంగా ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. దీంతో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది.

ప్రభుత్వానికి దమ్ముంటే టీటీడీ బోర్డును ప్రభుత్వం రద్దు చేసుకోవచ్చన్న సవాల్ విసిరారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన తరుణంలోనే టీటీడీ బోర్డు సమావేశం నుంచి బయటకు వచ్చిన ఓ సభ్యుడు తాను తన పదివికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. మూడు రోజుల క్రితం బోర్డు సమావేశం జరగాల్సి వున్నా ఇవాళ్టికి వాయిదా పడింది. కాగా ఈ ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన సమావేశం జరిగింది. టీటీడీ బోర్డు సమావేశం కావాలని ముందే నిర్ణయించామని, కానీ అధికారులు హాజరుకాలేదని ఆయన విమర్శించారు.

సమావేశం అదుపుతప్పిన వేళ, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. బోర్డు సభ్యుడు తెల్లాబాబు, తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బోర్డు సభ్యులంతా తప్పుకోవడం నైతికతని ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో వేడిని రగిల్చాయి. టీటీడీ ఉద్యోగులు బోర్డుకు ఎంతమాత్రమూ సహకరించలేదని కొందరు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న వేళ, ఇలా సమావేశాలు నిర్వహించడం సరికాదని, ఈఓ వెంటనే బోర్డును రద్దు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఎవరు రాజీనామా చేసినా తాను మాత్రం చేయనని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తమను నియమించిందని, తాము బోర్డులోకి వచ్చామని, తమ పదవీ కాలం ఇంకా ఉందని ఈ సందర్భంగా పుట్టా గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం బోర్డును రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న తరువాత మాత్రమే తాను పదవిని వీడుతానని ఆయన అన్నారు. స్వచ్ఛందంగా బోర్డును వీడేందుకు అత్యధిక సభ్యులు సుముఖంగా లేరని తెలిపారు. కాగా, నేటి పాలకమండలి సమావేశం జరిగిన తీరును ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అడిగి తెలుసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles