Congress denies Rahul offer to resign రాహుల్ రాజీనామా ప్రసక్తే రాలేదన్న కాంగ్రెస్

Rahul gandhi has not offered to resign yet clarifies congress

Rahul Gandhi, Congress Working Committee, Sonia Gandhi, Rahul Gandhi resignation, Priyanka Gandhi, Manmohan singh, Gulam Nabi Azab, Raj Babbar, Niranjan Patnaik, Mallikarjun Kharge, Uttar Pradesh, Odisha, National Politics

The Congress denied that Rahul Gandhi had offered to resign over the party's national election debacle as its top leaders met for a post-mortem after its 52-seat disaster - only a few more than its historic low of 44 in 2014.

రాహుల్ రాజీనామా ప్రసక్తే రాలేదన్న కాంగ్రెస్

Posted: 05/25/2019 01:34 PM IST
Rahul gandhi has not offered to resign yet clarifies congress

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ నేతలు రాజీనామాల బాట పట్టారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయా రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు తమ పదవులను త్యజిస్తూ.. తమ రాజీనామాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అనుసరించిన విధంగానే ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ మరోమారు తన రాజీనామాను అధిష్టానానికి పంపారు. సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ ఓటమికి తాను నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కోన్నారు.

ఇటు ఒడిశా పీసీసీ చీఫ్ నిరంజన్ పట్నాయక్‌లు తన పదవి రాజీనామా చేశారు. ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. 147 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో గెలుపొందింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నిరంజన్ పార్టీని విజయ పథాన నిలబెట్టలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాగా, రాహుల్ గాంధీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకన్నారని ఉదయం వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ విషయాన్ని తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా దృష్టికి తీసుకెళ్లగా ఆమె వారించినట్టు సమాచారం.

కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, గులాంనబీ అజాద్, వీరప్ప మొయిలీ తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ రాజీనామా వార్తలు ప్రకంపనలు రేపాయి. దీంతో కాంగ్రెస్ ఆ వార్తలను ఖండించింది. అసలు తమ సీడబ్యూసీ సమావేశంలో రాహుల్ రాజీనామా వార్తలు తెరపైకి రాలేదని వెల్లడించింది. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు ఒకటికి రెండు సార్లు కన్షామేషన్ తీసుకోవాలని, ఇష్టానుసారంగా వార్తలను రాసి.. వ్యక్తుల, వ్యవస్థల, పార్టీల ప్రతిష్టను దిగజార్చేందుకు చేసే యత్నాలు సహించరానివని పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles