Odisha govt begins evacuating people ఫణి ఎఫెక్ట్: ఒడిశాలో ఎన్నికల కోడ్ ఎత్తివేత..

Odisha govt begins evacuating people from low lying areas

IMD, Andhra cyclone alert, Odisha cyclone alert, cyclone alert odisha, IMD cyclone alert, Andhra pradesh fani storm, Andhra pradesh Weather, Andhra pradesh fani, Andhra pradesh storm, Andhra pradesh cyclone alert, Andhra pradesh fani alert, Odisha storm, puducherry storm, odisha weather, odisha fani storm alert, Cyclone Fani, Fani, Odisha, IMG, Puri

The Odisha government on Thursday started evacuating people from low-lying areas in several coastal districts to safer places as cyclone Fani is likely to hit the State’s coast in Puri district.

ఫణి ఎఫెక్ట్: తీరప్రాంతంలో భయాందోళన.. సముద్రం అల్లకల్లోలం

Posted: 05/02/2019 02:27 PM IST
Odisha govt begins evacuating people from low lying areas

యంకర ఫెను తుఫానుగా మారి ఒడిషా రాష్ట్రంలోని పూరి వద్ద ఇవాళ సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంతవాసుల్లో భయాందోళన రేకెత్తుతోంది. అంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర తీరప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఒడిశాలోని 11 జిల్లాల్లో దీని ప్రభావం వుంటుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఈ తరుణంలో ప్రభావిత ప్రాంతాల్లోని ముంపు ప్రాంతాల ప్రజలను ఓడిశా ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలను తరలిస్తుంది.

ముంపు ప్రాంతాల ప్రజలను ఇళ్లు ఖాలీ చేసిరావాల్సిందిగా కూడా అదేశిస్తుంది. ఇక ఆయా ప్రాంతాల్లో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. పూరి ప్రాంతంలోని పర్యాటకులను వెళ్లిపోవాల్సిందిగా అదేశించిన ప్రభుత్వం.. కేంద్రం సహాయంలో వారిని గమ్యస్థానాలను సురక్షితంగా చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఇటు ఉత్తరాంధ్రలోనూ తుపాను ప్రభావం తీవ్రంగానే వుంది. ఫణి ధాటికి ఉత్తరాంధ్రలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

అనేక తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. భీమిలి, విశాఖపట్టణం బీచ్‌ల వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. 4 నుంచి ఆరు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. తుపాను క్రమంగా తీరంవైపు దూసుకొస్తుండడంతో రియల్ టైమ్ గవర్నెన్స్ స్టాండీ (ఆర్టీజీఎస్) అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవరూ సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, సెల్ఫీలు తీసుకోవద్దని కోరారు. సర్వైలెన్స్ కెమెరాలతో తీర ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్న ఆర్టీజీఎస్.. అధికారులను అప్రమత్తం చేసింది.

శ్రీకాకుళం జిల్లాలోని గార, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, సంతబొమ్మాళి, పలాస, పొలాకి, నందిగం, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, చీపురుపల్లి, డెంకాడ, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాలపై ప్రభావం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, తీవ్ర తుపానుగా మారిన ఫణి పూరి వద్ద తీరం దాటిన అనంతరం తీరం వెంబడి పయనించి పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IMD  cyclone alert  Fani  AP cyclone alert  cyclone alert Odisha  Odisha storm  Andhra storm  andhra pradesh  

Other Articles