ECI orders re-polling in five booths in AP ఏపీలోని ఈ ఐదు కేంద్రాల్లో రీ-పోలింగ్.. ఎప్పుడంటే..

Election commission orders re polling in five booths of andhra pradesh

Elections in India, Andhra Pradesh, India, Elections, State Assembly elections in India, Campaigning in the 2014 Indian general election, Andhra Pradesh State Election Commission, Election Commission of India, Andhra Pradesh, Politics

The Election Commission of India has directed officials to conduct re-elections at five polling stations in Andhra Pradesh on May 6. Voting will be held in polling booths located in Guntur, Prakasam and Nellore districts, the ECI said in a letter dated May 01.

రీ-పోలింగ్ ప్రాంతాల్లో ప్రలోభాల జోరు.. ఓటే పది వేలు

Posted: 05/02/2019 11:36 AM IST
Election commission orders re polling in five booths of andhra pradesh

రాష్ట్ర అసెంబ్లీతో పాటు తొలివిడత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా లోక్ సభ ఎన్నికలు కూడా ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు, ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం అప్పుడే ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. కాగా, ఎన్ని పోలింగ్ బూత్ లలో,, ఎక్కడెక్కడ, ఎప్పుడు రీ-పోలింగ్ నిర్వహిస్తామన్న విషయాన్ని మాత్రం తరువాత వెల్లడిస్తామన్న ఎన్నికల సంఘం.. తాజాగా తేదీలతో పాటు ఏయే పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ నిర్వహించేంది వెల్లడించింది.

గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లిలో 94వ బూత్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులో 244వ బూత్‌, నెల్లూరు నియోజకవర్గంలోని పల్లెపాలెంలో ఇసుకపల్లి 41వ బూత్‌, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలో 197వ పోలింగ్ బూత్‌, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించిన ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నెల ఆరో తేదీన ఆయా పోలింగ్ బూత్‌‌లలో రీపోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

దీంతో మరో నాలుగు రోజుల వ్యవధిలో జరగనున్న ఎన్నికలలో వందల సంఖ్యలో వున్న ఓట్లను కొనుగోలు చేసేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి. ఓటుకు వేల రూపాయల ధర ఇస్తామంటూ అప్పుడే బేరసారాలు కూడా ప్రారంభించాయి. హోరా హోరీగా పోరుసాగిన నియోజకవర్గాలలో అభ్యర్థులు ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. మే 6న జరిగే రీపోలింగ్ లో రూ. 7,000 నుంచి రూ. 10,000 వెచ్చించడానికి వెనుకాడటం లేదు. ఈ ఓట్ల కొనుగోలు ప్రధానంగా నర్సరావుపేట, గుంటూరు వెస్ట్ , కోవూరు, సూళ్లూరుపేటలో నియోజకవర్గాలలో రీ-పోలింగ్ జరిగే కేంద్రాలలో జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles