Masood Azhar hidden in a safe house in Islamabad ఇస్లామాబాద్ లో రహస్య భవనంలో తలదాచుకున్న మసూద్ అజహర్

Jem chief masood azhar hiding in islamabad safe house reveals dossier

JeM, Pulwama terror attack, Masood Azhar, Masood Azhar terrorist, UN global terrorist list, Jaish e mohammed, Jaish Taliban nexus, Indian dossier on Jaish, Jaish e mohammed, Masood Azhar, Azhar Masood

Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar has been hidden in a secret safe house in Islamabad by the Pakistani ISI to shield him from Indian agencies, showed a fresh government dossier.

ఇస్లామాబాద్ లో రహస్య భవనంలో తలదాచుకున్న మసూద్ అజహర్

Posted: 05/02/2019 02:29 PM IST
Jem chief masood azhar hiding in islamabad safe house reveals dossier

కరడుగట్టిన ఉగ్రనేత, అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ పై ఐక్యరాజ్యసమితి ముద్రవేసిన నేపథ్యంలో ఆయన ఎక్కడ వున్నారు.? ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకునేందుకు.. అన్ని దేశాలు ఆసక్తికనబరుస్తున్నాయి. మసూద్ అజహర్ ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చి.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ ముద్రవేసిన నేపథ్యంలో ఏ దేశానికి వెళ్లేందుకు గానీ, ఎక్కడా తలదాచుకునేందుకు గానీ వీలుండని తరుణంలో ఆయన ఎక్కడవున్నారన్న అసక్తి నెలకోంది.

దీంతో మసూద్ అజహర్ కు చెందిన విదేశాల్లోని ఆస్తులు జప్తు చేసే వీలుండడంతోపాటు, అతడి ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర విఘాతం ఏర్పడనుంది. ఏ దేశ ప్రభుత్వమైనా మసూద్ అజహర్ పై చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ క్రమంలో ఆయన ఇస్లామాబాద్ లో అత్యంత భద్రత కలిగిన ఓ రహస్య భవనంలో దాక్కున్నట్టు భారత నిఘా వర్గాలు ప్రభుత్వానికి అందించిన నివేదికలో తెలిపాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధికారులే అతడిని దాచి పెట్టారని భారత నిఘా వర్గాలు తెలిపాయి.

బహవాల్ పూర్ పట్టణంలోని మర్కజ్ సుభాన్ అల్లా గృహ నిర్బంధంలో ఉన్న మసూద్ ను బాలాకోట్ దాడుల తర్వాత ఇస్లామాబాద్ లోని రహస్య ప్రాంతంలోని సురక్షిత భవనంలోకి తరలించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. మసూద్ అజర్ భారత్ పై ఎలా విషం చిమ్ముతున్నదీ అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి చూసిందని పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌ తోపాటు కశ్మీర్ లోయలో జిహాదీ కార్యకలాపాలను మసూద్ ఎలా విస్తరిస్తున్నదీ ఆ నివేదిక పత్రాల్లో పేర్కొన్నాయి. జైషే మహ్మద్ కార్యకలాపాలను విస్తరించే బాధ్యతను తన సోదరుడు, ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్ఘర్ కు మసూద్ అప్పగించాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles