UNSC designates Masood Azhar as global terrorist మసూద్ అజహర్ ఇక అంతర్జాతీయ ఉగ్రవాదే: ఐరాస ప్రకటన

United nation designates jem chief masood azhar as global terrorist

JeM, Jaish E Mohammed, Pulwama terror attack, Masood Azhar, Masood Azhar terrorist, UN global terrorist list, United Nations Security Council, United Nations

In a huge diplomatic win for India, the United Nations designated Pakistan-based Jaish-e-Mohammed chief Masood Azhar as a global terrorist after China lifted its hold on a proposal to blacklist him under the Security Council’s Sanctions Committee.

మసూద్ అజహర్ ఇక అంతర్జాతీయ ఉగ్రవాదే: ఐక్యరాజ్యసమితి ప్రకటన

Posted: 05/01/2019 07:53 PM IST
United nation designates jem chief masood azhar as global terrorist

కరడుగట్టిన ఉగ్రనేత, జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్ ఇకపై అంతర్జాతీయ ఉగ్రవాదే. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అయనపై ముద్రవేస్తూ ప్రకటనను వెలువరించింది. దీంతో భారత్ దౌత్యపరంగా అతిపెద్ద విజయం సాధించినట్లైంది. మసూద్ అజహార్ పై అంతర్జాతీయ ముద్ర వేయించేందుకు ఎంతోకాలంగా భారత్ చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలించింది. సెక్యూరిటీ కౌన్సిల్ ఆంక్షల కమిటీ కింద మసూద్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టే ప్రతిపాదనకు చైనా అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐరాస.

ఇన్నాళ్లూ తనకున్న వీటో పవర్ తో మసూద్ అజహర్ ను కాపాడుకొచ్చిన చైనా ఈసారి ఎలాంటి అడ్డుపుల్లలు వేయకుండా, గతంలో తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం వాపసు తీసుకుంది. ఐక్యరాజ్యసమితిఈ నిర్ణయం తీసుకున్న వెంటనే పాక్‌ కూడా స్పందించింది. మసూద్ కి గ్లోబల్‌ టెర్రరిస్ట్ ట్యాగ్ ఇవ్వడం పట్ల ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా మిన్నకుండిపోయింది.

తాజా ప్రకటన అనంతరం మసూద్ అజహర్ ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతున్నట్టు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయం నేపథ్యంలో మసూద్ అజహర్ పాకిస్థాన్ వెలుపల చేయడానికి ఇంకేమీ ఉండదు. విదేశాల్లో ఉన్న అతని ఆస్తులు జప్తు చేసే వీలుండడంతోపాటు, అతడి ఆర్థిక కార్యకలాపాలకు కూడా తీవ్ర విఘాతం ఏర్పడనుంది. ఏ దేశ ప్రభుత్వమైనా మసూద్ అజహర్ పై చర్యలు తీసుకునే వీలుంటుంది.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత మసూద్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించే విషయంలో భారత్ మరింత స్పీడ్ పెంచింది.అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్ దేశాల ఒత్తిడితో భారత స్పీడ్ కి చైనా అడ్డుతగలకపోవడంతో ఎట్టకేలకు మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. చిన్నా,పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో సహకరించిన అన్ని దేశాలకు కృతజ్ణతలు తెలుపుతున్నట్లు భారతీయ అంబాసిడర్ మరియు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles