BJP chief Laxman begins indefinite fast on inter goof up ‘‘ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయవిచారణ జరపాలి’’

Telangana inter exam goof up bjp chief laxman begins indefinite fast

intermediate exam, State, BJP chief, Laxman, Laxman indefinite hunger strike, muralidhar rao, three-member committee, shield the guilty, judicial probe, Globarena, Telangana, politics

Telangana BJP Chief K Laxman begins his indefinite fast from today, demanding a judicial probe into the alleged goof up in the declaration of results of intermediate examinations,

ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయవిచారణ జరపాలి: నిరవధిక దీక్షలో లక్ష్మణ్

Posted: 04/29/2019 01:38 PM IST
Telangana inter exam goof up bjp chief laxman begins indefinite fast

విద్యార్థుల ఆత్మహత్యలు, ఎందరో విద్యార్థుల మనోవేధనకు కారణమైన ఇంటర్ బోర్డు అధికారులను ప్రభుత్వం కొమ్మకాస్తుందని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో నివేదికపై అదే ప్రభావం వుందని తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇంటర్‌ విద్యార్థులకు పూర్తి న్యాయం చేయాలని డిమండ్‌ చేశారు. రాష్ట్ర కార్యాలయంలో ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని, ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని అన్నారు.

ఇంటర్ విద్యార్థులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారని... అయినా ఇంటర్ బోర్డు అవకతవకల విషయంలో ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సమాజం విచిత్రమైన పరిస్థితుల్లో కొనసాగుతోందని అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘోర తప్పిదాలను ఎన్నడూ చూడలేదని చెప్పారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు... రాష్ట్రాన్ని బలిదానాల తెలంగాణగా మార్చుతున్నారని విమర్శించారు. పిల్లల హక్కును కాలరాసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.

విద్యాశాఖ మంత్రి బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ దీక్షను భగ్నం చేసేందుకు బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ చాటున తమ పార్టీ కార్యాలయానికి రావాల్సి వచ్చిందని... రాష్ట్రంలో ఇంత దారుణమైన ప్రభుత్వం ఉందని అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, తల్లిదండ్రుల విశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్పారు. న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామని లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు, హర్తాళ్లు చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకరమైందని.. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యం చేత విద్యార్థుల ఆత్మబలిదానాలు జరగదం అందోళనకరమని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles